Begin typing your search above and press return to search.
అంబటి వర్సెస్ అయ్యన్న: ఎంత ట్వీట్ తిట్లు అయితే మాత్రం మరీ ఇంతలానా?
By: Tupaki Desk | 12 May 2022 8:51 AM GMTకోపం కట్టలు తెచ్చుకుంటోంది. వెనుకా ముందు చూసుకోకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడం ఈ మధ్యన రాజకీయ నేతలకు ఎక్కువైంది. ప్రత్యర్థిపై నిర్మాణాత్మక విమర్శలు.. ఘాటైన ఆరోపణల్ని వదిలేసి.. కుళాయి దగ్గర జరిగే నీళ్ల పచాయితీ కంటే హీనంగా మాట్లాడుకోవటం ఈ మధ్యన ఎక్కువైంద.
కొడుకు మరణించిన సంవత్సరీకం రోజున అరెస్టు చేయటానికి వచ్చిన అధికారులతోకాసేపు తనకు అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ ససేమిరా అంటూనే అదుపులోకి తీసుకెళ్లటం.. యుద్ధ ప్రాతిపదికన హైదరాబాద్ నుంచి చిత్తూరుకు రోడ్డు మార్గాన తీసుకెళ్లి.. న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. అయితే.. అధికారులు ఆరోపించినట్లుగా మాజీ మంత్రి నారాయణ తన విద్యా సంస్థలకు ఛైర్మన్ గా వ్యవహరించటం లేదన్న అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరైంది
దీనిపై ఆసక్తికర సంవాదం నడుస్తోంది. అధికార పక్షం తీరుపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు.
కనీస మానవత్వం లేకుండా వ్యవహరించటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో తప్పు చేయకపోయినా అరెస్టు చేసినట్లుగా పేర్కొంటూ టీడీపీ నేతలు ట్విటర్ లో పోస్టులు పెట్టటం.. దానికి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు వర్సస్ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మధ్య ట్వీట్ రచ్చ అంతకంతకూ పెరిగి.. వ్యక్తిగత విషయాలకు వెళ్లటమే కాదు..రాజకీయాల్లో పాటించాల్సిన మర్యాద.. గౌరవాన్ని పూర్తిగా వదిలేసిన వైనం కనిపిస్తుంది.
'కొడుకు వర్దంతి రోజే కక్ష కట్టి మరీ తప్పుడు కేసులో మాజీ మంత్రి నారాయణ దంపతుల్ని అరెస్టు చేయించిన జగన్ రెడ్డి ముమ్మాటికి సైకో ముఖ్యమంత్రే అని అయ్యన్న పాత్రుడు మండి పడితే.. దానికి కౌంటర్ గా అంబటి రాంబాబు రియాక్టు అవుతూ.. పరీక్ష పేపర్ లీక్ చేస్తే.. అరెస్టు చేయక పద్మభూషణ్ బిరుదు ఇస్తారా? అని ప్రశ్నించారు. దీనికి అంతే ధీటుగా రియాక్టు అయ్యారు అయ్యన్న పాత్రుడు.
"హస్కీ వాయిస్ తో ఆడియో లు లికైతే కాంబాబు అనకపోతే రాంబాబు అంటారా? నారాయణ గారి అరెస్ట్ కి ఆధారాలు లేవు, నీ పరువు తక్కువ పనులకు ఆడియోలు ఉన్నాయి కాంబాబు!" అని అయ్యన్న అన్న మాటలకు ఆగ్రహం వ్యక్తం చేసిన అంబటి.. 'అరగంట.. గంట అంటే నాకు కోపం రాదు కానీ మాధవరెడ్డి.. లోకేష్ అంటే మీకు కోపమొస్తుంది మరీ' అంటూ దారుణ వ్యాఖ్య చేశారు.
దీనికి బదులిచ్చిన అయ్యన్న.."సూరీడు ...జగన్ రెడ్డి అంటే మీకు కోపమొస్తుంది మరి కాంబాబు! అనమంటావా? ఆడియోలో అడ్డంగా దొరికిపోయిన బ్రోకర్ నోరుమూసుకుని ఉండాలి. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే" అంటూ మరింతగా చెలరేగిపోయారు. వీరి ట్వీట్ల సంవాదం చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. మంత్రగా అంబటి.. మాజీ మంత్రిగా వ్యవహరిస్తున్న అయ్యనలు కాస్తంత డీసెన్సీని మొయింటైన్ చేస్తే బాగుంటుందన్న మాట వినిపిస్తోంది. చూస్తుంటే.. రానున్న రోజుల్లో ఇలాంటి రచ్చ మరింత పెరగటం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది.