Begin typing your search above and press return to search.
అలా అనుకుంటారని ఆయన చెప్పుడేంది?
By: Tupaki Desk | 7 Dec 2015 4:16 AM GMTప్రముఖ వ్యక్తులకు సంబంధించిన విషయాలు చెప్పే పేరుతో.. ఆయన అనుకున్నవి లేనివి కలేసి చెప్పటం లేనిపోని వివాదాలకు దారి తీస్తుంది. ఇప్పుడు అలాంటి వివాదాన్నే తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు కేంద్రమంత్రి. వివాద వ్యాఖ్యలతో సహజీవనం చేసే ధోరణి బాగా వంటపట్టించుకున్న కమలనాథులకు ఇప్పుడా అలవాటు ఒక పట్టాన పోయేటట్లుగా లేదు.
అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా ఆయన గురించి ప్రస్తావించిన కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ.. వివాదాన్ని రేకెత్తించే అంశాన్ని ప్రస్తావించారు. అయోధ్యలో రామమందిరానికి సంబంధించి ఇష్యూలోకి అంబేడ్కర్ ను లాగారు. అయోధ్యలో రామమందిరం ఉండేదని బీఆర్ అంబేడ్కర్ విశ్వసించేవారి.. ఆలయం ఉందని నమ్మే వారంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
జీవించలేని ప్రముఖులకు సంబంధించి వివాదాస్పద అంశాల్లోకి లాగటం సబబుగా అనిపించదు. అయోధ్యలోని రామ మందిరం గురించి అంబేడ్కర్ అలా అన్నారో లేదో తెలీదు. మంత్రి చేసిన వ్యాఖ్యల కారణంగా ఇప్పుడిదో వివాదంగా మారే అవకాశం ఉంది. దీన్ని ఖండిచేవాళ్లు ఉన్నట్లే.. సమర్థించేవాళ్లు పుట్టుకొస్తారు. చివరకు ఇదో అసహనంగా మారుతుంది. లేనిపోని అంశాల్ని ప్రస్తావించి.. వివాదాల్ని కొని తెచ్చుకోవటం బీజేపీ నేతలకు సరదాలా ఉందే.