Begin typing your search above and press return to search.
అంబేడ్కర్ పై యోగి సర్కార్ షాకింగ్ నిర్ణయం!
By: Tupaki Desk | 6 Dec 2017 11:52 AM GMTఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించాక కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా ఆచరించే కొన్ని విషయాలు మినహా పాలనలో ఆయనకు ప్రజలు మంచి మార్కులే వేశారు. అధికారం చేపట్టిన కొత్తలో యోగి....రాష్ట్రంలోని అల్లరి మూకలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత అఖిలేష్ యాదవ్ ఫొటో - పేరు ముద్రించి ఉన్న స్కూల్ బ్యాగులను మార్చకుండా యథావిధిగా పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో యోగి ప్రజలపై తనదైన ముద్ర వేశారనే చెప్పవచ్చు. అయితే, కొద్ది రోజుల నుంచి యోగి ప్రతిష్ట కొద్దిగా మసకబారుతూ వస్తోంది. విధి నిర్వహణలో మరణించిన బీఎస్ ఎఫ్ జవాను కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వారి ఇంటికి వెళ్లిన యోగిపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. యోగి రాక కోసమే ఆ ఇంట్లో ఏసీ - సోఫా - కార్పెట్లను అధికారులు ఏర్పాటు చేశారని తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత యోగి పర్యటించబోతోన్న ప్రాంతంలోని దళితులకు సబ్బు - షాంపూలను పంపిణీ చేయడం సంచలనం రేపింది. ఈ రెండు సందర్భాల్లోనూ అధికారుల అత్యుత్సాహం వల్లే ఈ వివాదాలు జరిగాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత గోరఖ్ పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో దాదాపు 70 మంది పసి పిల్లలు మరణించడంతో యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ వర్ధంతి రోజు సెలవును రద్దు చేస్తూ యోగి సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
అంబేడ్కర్ వర్థంతి రోజున సెలవు రద్దు చేస్తూ యోగి నిర్ణయం తీసుకున్నారు. దీంతో, రద్దు చేసిన సెలవుల సంఖ్య 16కు పెరిగింది. గతంలో - అంబేడ్కర్ వర్ధంతిని బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఆ తర్వాత 2012లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం ఆ సెలవును రద్దు చేసింది. మళ్లీ అఖిలేష్ యాదవ్ సర్కార్ ఆ సెలవును పునరుద్ధరించింది. తాజాగా, యోగి ఆదిత్యనాథ్ ఆ సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, యోగి నిర్ణయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
యోగి సర్కార్ ఇప్పటివరకు 16 సెలవులను రద్దు చేసింది. ఆ జాబితాలో .....జననాయక్ కర్పూరి ఠాకూర్ర జయంతి - 4 జనవరి 2017 - మహర్షి కశ్యప్ - మహరాజ్ గుహ జయంతి - 5 ఏప్రిల్ 2017 - చేటి చంద్ - 29 మార్చి 2017 - హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అజ్మేరి గరీబ్ కా ఉర్స్ 6 రజబ్ - 14 ఏప్రిల్ 2017 - చంద్రశేఖర్ జయంతి - 17 ఏప్రిల్ 2017 - పరశురాం జయంతి - 28 ఏప్రిల్ 207 - లోక్ నాయక్ మహారాణా ప్రతాప్ జయంతి - 9 మే 2017 - జమాత్ - ఉల్ - విదా (రంజాన్ చివరి రోజు ) - 23 జూన్ 217 - విశ్వకర్మ పూజ - 17 సెప్టెంబర్ 2017 - మహారాజా అగ్రేసన్ జయంతి - 21 సెప్టెంబర్ 2017 - మహర్షి వాల్మీకి జయంతి - 5 సెప్టెంబర్ 2017 - ఛత్ పూజ - 26 అక్టోబర్ 2107 - సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ - ఆచార్య నరేంద్ర దేవ్ జయంతి - 31 అక్టోబర్ 2017 - ఈద్ - మిలాదున్నవి - 2 డిసెంబర్ 2107 - చౌదరి చరణ్ సింగ్ జయంతి - 23 డిసెంబర్ 2017 ఉన్నాయి.