Begin typing your search above and press return to search.

తెలంగాణ కొత్త సచివాలయానికి 'అంబేద్కర్'పేరు!

By:  Tupaki Desk   |   15 Sep 2022 12:02 PM GMT
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్పేరు!
X
తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి నుంచి దళిత వ్యతిరేకి అంటూ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని.. దళితుడిని తొలి సీఎం చేస్తానని ఎన్నికల ముందర పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చాడు. కానీ తెలంగాణలో టీఆర్ఎస్ కు మెజార్టీ సీట్లు రావడంతో తనే సీఎం కుర్చీలో కూర్చొని మాట మార్చారు. అస్థిర తెలంగాణ స్థిరంగా చేయడానికని నమ్మించాడు.

అయితే ఇప్పుడు బీజేపీ దూసుకొస్తోంది. ప్రతీదాంట్లోనూ కేసీఆర్ తప్పులు ఎత్తి చూపుతోంది. దళిత వ్యతిరేకి అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తోంది. ఈక్రమంలోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే అసెంబ్లీలో కొత్త పార్లమెంట్ కు 'అంబేద్కర్' పేరు పెట్టాలని తీర్మాణం చేశాడు. ఇప్పుడు ఏకంగా తను నిర్మిస్తున్న కొత్త సచివాలయానికి 'అంబేద్కర్' పేరు పెట్టాలని నిర్ణయించారు.

తెలంగాణ కొత్త సచివాలయానికి 'డా. బీ.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కాసేపట్లో జీవో జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టాకు 'అంబేద్కర్ 'పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం తరుఫున కేసీఆర్ కోరారు. కానీ కొందరు ఇక్కడ సచివాలయం సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అందుకే బీజేపీని డిఫెన్స్ లో పడేసేలా కేసీఆర్ వ్యూహాత్మకంగా కదులుతున్నారు. తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి అందరికీ షాక్ ఇచ్చారు.

దీంతో ఇప్పుడు బీజేపీ పెద్దలు ఇరకాటంలో పడ్డారు. కేసీఆర్ చేతల్లో చూపించడంతో పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలన్నది కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. కానీ కేంద్రంలోని పెద్దలంతా బీసీలు, అగ్రవర్ణాలకే మద్దతుగా ఉన్నారు. వారు అంబేద్కర్ పేరు కొత్త పార్లమెంట్ కు పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మరి కేసీఆర్ ఎత్తుగడకు బీజేపీ చిత్తవుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.