Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే కరణం బలరాం కుమార్తెపై హత్యాయత్నం?.. సంచలన ఆరోపణలు!?
By: Tupaki Desk | 14 Nov 2022 5:30 AM GMTటీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం వైసీపీలో ఉన్న చీరాల ఎమ్మెల్యే, సీనియర్ నేత.. కరణం బలరాం ఇంటి తగదాలు తరచుగా తెరమీదికి వస్తున్నాయి. కరణం బలరాం గతంలో సహజీవనం చేసిన విషయం కొన్నాళ్ల కిందటవెలుగు చూసింది అని అంటుంటారు. టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, కరణం బలరాంలు.. గతంలో సహజీవనం చేయగా.. వీరికి అంబిక అనే కుమార్తె ఉంది అని గతం లో ఆమంచి బయటపెట్టారు .
ఈ అంబిక.. గత ఏడాదిన్నర కాలం నుంచి కూడా తరచుగా రాజకీయ తెరమీద కనిపిస్తూనే ఉన్నారు. తన తండ్రి కరణం ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన పేరును పేర్కొనలేదని ఒకసారి.. ఆస్తుల విషయంలో కరణం బలరాం వివాహం చేసుకున్న ఆమెకు జన్మించిన కుమారుడు, ప్రస్తుతం వైసీపీ యువ నాయకుడు కరణం వెంకటేష్‌తో తనకు వివాదాలు ఉన్నాయని మరోసారి.. రక రకాల వార్తలు ప్రచారం లో ఉన్నాయ్
ఇలాంటి సమయంలోనే కరణం.. అంబికను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. తర్వాత.. ఏం జరిగిందో ఆ వివాదం అయితే సమసిపోయింది. కానీ, తాజాగా కరణం వెంకటేష్.. అంటే తన అన్న తనను చంపాలని ప్రయత్నించినట్టు అంబిక తాజాగా సంచలన ఆరోపణలు చేశారు అని ఒక వార్త వినిపిస్తుంది . ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చి.. హైదరాబాద్‌కు పంపించారనేది అంబిక ఆరోపణ చేశారట . ఇప్పటికే అనేక సార్లు తనపై హత్యాయత్నం జరిగిందని, కానీ, అన్ని సార్లూ తప్పించుకున్నానని.. తాజాగా తమ నివాసం హైదరాబాద్‌లోని ఇంట్లోకి ఓ వ్యక్తి ప్రవేశించి తమపై దాడికి యత్నించారని అంబిక తాజాగా పోలీసులను ఆశ్రయించింది అని చెబుతున్నారు. దీంతో మళ్లీ కరణం కుటుంబ వివాదం రసవత్తరంగా మారింది.
అసలు ఏం జరిగింది?
మాజీ ఎమ్మెల్యే తెలంగాణ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన.. కరణం బలరాంలు సహజీవనం చేశారని.. గతంలో అంబికే ప్రకటించుకుని.. సదరు ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేసింది అని అంటుంటారు. అయితే.. తాజాగా వీరు ఉంటున్న ఇంట్లోకి ఓ ఆగంతకుడు శనివారం రాత్రి 11 గంటలకు గోడ దూకి ప్రవేశించాడు. మొదటి అంతస్తులో ప్రసూన, ఆమె కుమార్తె అంబికలపై దాడి చేసేందుకు యత్నించాడని అంబిక ఆరోపణ.
రెండో అంతస్తులో ఉంటున్న డ్రైవర్, సిబ్బంది బయటకు రాకుండా తలుపు గడియ పెడుతుండగా అలికిడి విని వారు అప్రమత్తం కావడంతో పరారయ్యాడు. ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించిన తీరు, బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ప్రసూన ఇంటి పక్కనే ఉన్న ఓ బార్లో ఉన్న ఆగంతకుడిని తెలుగు దేశం పార్టీ శ్రేణులు పట్టుకుని ఎస్ఆర్ నగర్ పోలీసులకు అప్పగించాయి. కాగా.. తప్పించుకునే ప్రయత్నంలో రెండో అంతస్తు నుంచి కిందకు దూకుతున్న సమయంలో అతని సెల్‌ఫోన్ ప్రసూన ఇంటి ఆవరణలో పడిపోయింది అని అంటున్నారు.
ఆ సెల్‌ఫోన్లో ఉన్న నెంబర్ల ఆధారంగా ప్రకాశం జిల్లా వైసీపీ నాయకుడు కరణం వెంకటేష్ ఆదేశాల మేరకు అతని వ్యక్తిగత కార్యదర్శి త్రివేది రంగంలోకి దిగి చంద్రశే ఖర్ అనే వ్యక్తికి సుపారి ఇచ్చి తన కూతురుని హత్య చేయించేందకు పథకం పన్ని నట్టు ప్రసూన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు అని అంటున్నారు. అయితే, పోలీసులు మాత్రం చంద్రశేఖర్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని తాగిన మైకంలో ప్రసూన ఇంట్లోకి గోడదూకి ప్రవేశించినట్టు భావిస్తున్నామని, పూర్తి వివరాలు రాబడుతున్నామని వారు చెప్పారు. మొత్తానికి కరణం కుమార్తె అని చెప్పుకుంటున్న అంబికా వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్ కావడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.