Begin typing your search above and press return to search.
బాలయ్యకు చెప్పి మరీ షాకిచ్చాడు..
By: Tupaki Desk | 26 Jun 2019 4:38 AM GMTపార్టీలో ఉన్నన్నీ నాళ్లు వీరవిధేయులు.. అధికారం దూరమై నెల రోజులు కూడా గడువక ముందే మన నాయకులు తట్టుకోలేకపోతున్నారు. స్వతహాగా ప్రజల్లో ఉన్న వారైతే ఇలా చేయరు.. కానీ పారిశ్రామిక వేత్తలుగా మేనేజ్ చేసి పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు టీడీపీని కాలదన్నుతున్నారు. అందలం ఎక్కించిన చంద్రబాబుపైనే దుమ్మెత్తి పోస్తున్నారు.
తాజాగా చంద్రబాబుకు ఆర్థిక వెన్నుదన్నుగా ఉన్న టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజన - సీఎం రమేష్ లు షాకిచ్చి బీజేపీలో చేరినప్పుడే టీడీపీలో అలజడి రేగింది. బాబుకు అత్యంత నమ్మకస్తులైన వీరితో పాటు మరో ఇద్దరు పారిశ్రామికవేత్తలు టీజీ - గరికపాటి కూడా సైకిల్ దిగి కమళం గూటికి చేరారు. వీరి షాక్ మరిచిపోకముందే టీడీపీ ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్ మెంట్ చైర్మన్ గా ఉన్న సినీ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ టీడీపీని వీడడం కలకలం రేపింది. అయితే వీడితే వీడాడు కానీ ఆయన బీజేపీలో చేరాక మాట్లాడిన మాటలు మాత్రం టీడీపీలో కాకరేపాయి.
తాజాగా అంబికాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే టీడీపీ ఓడిందని సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ కార్యకర్తలు - నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారని.. బాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఓడించాయన్నారు. ప్రధానంగా బీజేపీని వీడి కాంగ్రెస్ తో జట్టుకట్టడం.. 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వడంపై బాబుకు ముందే చెప్పినా పట్టించుకోలేదన్నారు. అందుకే టీడీపీ ఓడిపోయిందన్నారు. ఇక తాను పార్టీ మారే విషయాన్ని చంద్రబాబుకు చెప్పలేదని.. ఆయన అందుబాటులో లేకపోవడంతో బాలక్రిష్ణకు చెప్పానని అంబికాకృష్ణ తెలిపారు. ఇలా చెప్పి మరీ పార్టీ మారాడంటే అంబికా కృష్ణ గట్స్ ను అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామంతో ఇక చంద్రబాబు - టీడీపీ అంటే నేతలకు భయం - భక్తి లేకుండా పోయాయని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ ఇక పుంజుకోలేదనే ఇలా నాయకులు టీడీపీని వీడుతూ ఆ పార్టీపై నిందలేయడం చర్చనీయాంశమవుతోంది.
కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో అంబికా కృష్ణ కీలక నేతగా ఉన్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీకి కంచుకోట అయిన పశ్చిమగోదావరిలో ఈసారి టీడీపీ కేవలం 2 సీట్లే గెలిచింది. వైసీపీ గాలి వీచింది. ఇప్పుడు అంబికా కూడా తప్పుకోవడంతో టీడీపీ మరింత బలహీనపడడం ఖాయమంటున్నారు.