Begin typing your search above and press return to search.

ప్రాణాల్ని కాపాడే అంబులెన్సు కు ప్రమాదం.. వీడియో చూస్తే గుండె ఝల్లు!

By:  Tupaki Desk   |   21 July 2022 5:30 AM GMT
ప్రాణాల్ని కాపాడే అంబులెన్సు కు ప్రమాదం.. వీడియో చూస్తే గుండె ఝల్లు!
X
ప్రాణాలు పోయే వేళలో సంజీవిని మోసుకొచ్చినట్లుగా వచ్చే అంబులెన్స్ దారుణ ప్రమాదానికి గురి కావటం ఒక ఎత్తు అయితే.. ప్రమాదం జరిగిన తీరును చూస్తే గుండె ఝల్లుమనటం ఖాయం. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

షాకింగ్ గా మారిన ఈ ప్రమాదం జరిగిన తీరు చూస్తే.. నిజంగా ఇలా కూడా ప్రమాదం జరుగుతుందా? అన్న సందేహం కలుగక మానదు. ఉడిపి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘోర యాక్సిడెంట్ లో అంబులెన్స్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు మరణించగా.. టోల్ బూత్ సిబ్బంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..

ఉడిపి జిల్లాలోని కుందాపురం నుంచి ఒక రోగిని అంబులెన్సులో హోన్నవర ఆసుపత్రికి తరలిస్తున్నారు. సాధారణంగా అంబులెన్సు అంటేనే వేగంగా వెళుతుంటుంది. అందునా అత్యవసర వైద్యం అవసరం కావటంతో అపరిమితమైన వేగంతో అంబులెన్సు వెళుతోంది. దీని రాకను గమనించిన.. టోల్ గేట్ సిబ్బంది వెంటనే స్పందించి.. బారికేడ్లను క్లియర్ చేయటం.. వంతెన గేటు ను అప్పటికప్పుడు ఎత్తి ఉంచి.. ప్రత్యేక లైన్ నుంచి వాహనాన్ని పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

అంతా బాగుంది కానీ..టోల్ గేట్ నుంచి బయటకు వచ్చినంతనే ఉన్న బారికేడ్ ను తొలగించేందుకు అక్కడి సిబ్బంది వేగంగా రియాక్టుఅయి.. దాన్ని బయటకు తీసే క్రమంలో.. టోల్ గేట్ వద్దకు వచ్చిన వేళ.. అక్కడ ఉన్న వర్షపు నీటికి అంబులెన్సు ఒక్కసారిగా అదుపు తప్పటం..టోల్ గేట్ ను ఢీ కొనటంతో సెకన్ల వ్యవధిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్సు చక్రాలు జారిపోవటం.. అంబులెన్స్ టోల్ బూత్ ను ఢీ కొనటం లాంటివి సెకన్ల వ్యవధిలోనే జరిగిపోయాయి.

ఈ ప్రమాదం ఎంతలా అంటే.. అంబులెన్సులోని ఉన్న రోగి..ఇద్దరు సహాయకులు వాహనం నుంచి రోడ్డు మీదకు ఎగిరి పడి మరణించారు. అంతేకాదు.. అంబులెన్స్ ఢీ కొన్న టోల్ బూత్ సిబ్బంది ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. అతను కూడా మరణించారు.

ఈ ఘోర ప్రమాదానికి కారణమైన అంబులెన్సు డ్రైవర్ మాత్రం గాయాలతో బయటపడినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఎంత దారుణ ప్రమాదం జరిగిందన్న విషయంఈ వీడియోను చూసినంతనే ఇట్టే అర్థం కాక మానదు.