Begin typing your search above and press return to search.
అంబులెన్స్ డ్రైవర్ల కిరాతకం .. కిరాయి లేదని ఆక్సిజన్ ఆపేసి .. !
By: Tupaki Desk | 25 May 2021 1:30 AM GMTకరోనా వైరస్ విజృంభణ దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగుతోంది. దేశవ్యాప్తంగా రోజురోజుకి నమోదు అయ్యే మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో కూడా కొందరు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. గిరాకీ రావడం లేదని ఏకంగా ఐసీయూ లో ఉండే కరోనా రోగులను చంపడానికి కూడా వెనుకాడటం లేదు. కరోనా రోగులకు ఆరోగ్యం సీరియస్ అయినా , లేదా ఒకవేల చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు దిగారు. ఆక్సిజన్ సప్లై ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. అయితే , సకాలంలో ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో ఆ కరోనా రోగుల ప్రాణాలు నిలిచాయి.
ఈ అత్యంత హేయమైన ఘటన తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. తమకు కొద్దిరోజులుగా పేషంట్లు దొరకడం లేదని, గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు ఈ దారుణానికి పూనుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ సరఫరాని ఆపేశారు. ఆక్సిజన్ సప్లై ఆగిపోవడాన్ని గమనించిన వార్డు బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఆక్సిజన్ సప్లై ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. కొద్దిరోజులుగా అంబులెన్సులకు గిరాకీ లేదని.. ఎవరికైనా సీరియస్ అయినా, లేకుంటే చనిపోతే తమకు గిరాకీ వస్తుందని భావించి ఈ పని చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్ గా తీసుకోని వారికి కఠినమైన శిక్ష పడేలా చేస్తామన్నారు.