Begin typing your search above and press return to search.

మద్యం కోసం ఆగిన 'అంబులెన్స్'.. వైరల్..!

By:  Tupaki Desk   |   21 Dec 2022 4:17 AM GMT
మద్యం కోసం ఆగిన అంబులెన్స్.. వైరల్..!
X
ఎవరైనా రోగికి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ వాహనాలను వాడుతుంటారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు ఆ వాహనానికి దారి ఇస్తుంటారు. పోలీసులు సైతం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ సహకరిస్తుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. కాగా ఓ అంబులెన్స్ డ్రైవర్ ఏకంగా మద్యం కోసం వాహనాన్ని ఆపి మద్యం కొనుగోలు చేశాడు.

తాను తాగడమే కాకుండా వాహనంలో ఉన్న పెషేంట్ కు ఓ పెగ్గు పోయడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన నడిరోడ్డుపై జరుగుతుండటంతో అంబులెన్స్ డ్రైవర్ పలువురు వారించారు. అయితే పేషంటే మద్యం బాటిల్ కొనమని డబ్బులు సైతం ఇచ్చాడని చెప్పాడు. ఈ సంఘటనను పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది.

ఒడిశా జగత్సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ హైవేలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ వాహనం రోడ్డు పక్కనే ఉన్న మద్యం షాపు ముందు ఆగింది. అందులోని నుంచి డ్రైవర్ దిగి మద్యం బాటిల్ కొనుగోలు చేసి ఓ గ్లాసులో పోసుకొని మద్యం సేవించాడు. అనంతరం వాహనంలో కాలికి గాయమై స్ట్రైచర్ మీద పడుకున్న ఒక పేషంట్ కు ఒక పెగ్గు పోశాడు. ఈ సమయంలో బాధితుడి పక్కనే ఓ మహిళ.. ఒక చిన్న అబ్బాయి కూడా ఉండటం గమనార్హం.

ప్రధాన రహదారి పక్కనే అంబులెన్స్ డ్రైవర్ మద్యం సేవిస్తుండటంతో పలువురు అతడిని వారించే ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానికులకు అతడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆ డ్రైవర్ షేషంటే మద్యం అడిగారని అందుకోసమే ఆగానని చెప్పాడు. ఈ సంఘటన మొత్తాన్ని పలువురు వాహనదారులు తమ సెల్ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ విషయంపై సంబంధిత జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ అది ఓ ప్రైవేట్ అంబులెన్స్ వాహనం అని చెప్పారు. అంతకంటే తమ వద్ద సమాచారం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ ఘటనపై ఆర్డీవో.. పోలీసులు విచారణ జరిపి డ్రైవర్ పై చర్యలు తీసుకోవచ్చని డీఎంహెచ్ఓ వెల్లడించారు.

ఈ ఘటనపై తమకైతే ఇంత వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తిర్తోల్ పోలీసులు వెల్లడించారు. ఏది ఏమైనా మద్యం తాగి వాహనం నడపడం చట్టరీత్యా నేరమని.. తాను తాగడమే కాకుండా రోగికి సైతం మద్యం ఇచ్చిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.