Begin typing your search above and press return to search.

ఓ వైపు కరోనా...మరోవైపు అంబులెన్సుల మాఫియా

By:  Tupaki Desk   |   20 July 2020 5:45 PM GMT
ఓ వైపు కరోనా...మరోవైపు అంబులెన్సుల మాఫియా
X
దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో కోటి 45 లక్షలకి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఆరు లక్షలకి పైగా మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తుంటే ఇలాంటి సమయంలో కూడా కొందరు సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ కరోనా అంబులెన్సుల యజమానులకు వరంగా మారింది. కరోనా భాదితులని తరలించేందుకు ఈ అంబులెన్స్ లను ఉపయోగిస్తున్న నేపథ్యంలోఇష్టానుసారంగా చార్జీలు పెంచేస్తున్నారు. కేవలం 10 నుంచి 15 కిలోమీటర్ల దూరానికి ఈ అంబులెన్సులు భారీ మొత్తాలను వసూలు చేస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు ఈ చార్జీలను హేతుబధ్ధం చేయాల్సి వస్తుంది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అయ్యేది దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మహారాష్ట్రలోనే .. మహారాష్ట్రలో 15 కి.మీ. లోపు దూరానికే 30 వేలకి పైగా వసూలు చేస్తున్న విషయం గత జూన్ నెల చివరి వరకు కూడా ప్రభుత్వ దృష్టికి రాలేదు. పూణే లో కిలోమీటర్ కి 3 వేలు, ముంబై లో 7 కిలోమీటర్ల దూరానికి 8 వేల రూపాయలు కూడా కొన్ని అంబులెన్స్ యజమానులు వసూలు చేశారట. ఈ కారణంగా అక్కడి ప్రభుత్వం అంబులెన్స్ చార్జీలను రెగ్యులేట్ చేసింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. కరోనాకి ముందు ఐదు కిలోమీటర్ల దూరానికి 80 నుంచి 120 రూపాయలు, ఔట్ స్టేషన్ 25 నుంచి 40 రూపాయలు వసూలు చేస్తూవచ్చారు. ప్రస్తుతం 10 కి.మీ. దూరానికి 5 వేల నుంచి 10 వేల వరకు , అలాగే సిటీ బయటి ప్రాంతాలకి వెళ్లాల్సి వస్తే కిలోమీటర్ కి 30 నుంచి 60 రూపాయలు వసూలు చేస్తున్నారట.

ఇక కోల్ కత్తా లో 5 కి.మీ. దూరానికి 6 వేల నుంచి 8 వేలు వసూలు చేస్తున్నారట. ఇక చండీగఢ్ లో గతంలో బేసిక్ అంబులెన్స్ కి 250 నుంచి 400 రూపాయలు, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ కి అయితే 1500 వసూలు చేసేవార. కానీ , కరోనా వైరస్ విజృంభణ మొదలైనప్పటి నుండి బేసిక్ అంబులెన్స్ కి 600 రూపాయల నుంచి 800, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ అయితే 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారట. ఇక ఝార్ఖండ్ లో కరోనా వైరస్ విజృంభణ మొదలు కాకముందు 10 కి.మీ.లోపు అయితే రూ. 500, దూర ప్రాంతాలకు కిలోమీటర్ కి 10 రూపాయల చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు 10 కి.మీ. దూరానికి రూ. 900, దూర ప్రయాణాలకు కిలోమీటర్ కి 13 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక యూపీలో కరోనా వైరస్ రాక ముందు కి.మీ.కి 10 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం దాన్ని 13 రూపాయలకు పెంచారు. ఇలా దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికొ అంబులెన్సులు మాఫియా పరిమితం కాలేదు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే విధముగా చార్జీలు పెంచేస్తున్నారు. అయితే కరోనా భారిన పడి పీకల్లోతు కష్టాల్లో ఉంటే... ఈ విధంగా ఇష్టానుసారంగా చార్జీలు పెంచి వసూలు చేయడం ఏ మాత్రం సబబు కాదు.