Begin typing your search above and press return to search.
అమెరికాలో అలా.. ఐరోపాలో మరోలా?
By: Tupaki Desk | 20 Jan 2016 10:30 PM GMTఅభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు దాదాపు ఒకేలా ఉంటాయని భావిస్తుంటారు. కానీ.. అమెరికా.. ఐరోపాలోని పలు దేశాల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. సంపన్న దేశాలుగా పేరొందిన అమెరికా.. ఐరోపాలోని పలు దేశాల్లో పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
అమెరికాలో పుట్టే వారి సంఖ్య పెరిగి.. చనిపోయే వారి సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో ఐరోపాలోని పలు దేశాల్లో మాత్రం పుట్టే వారి సంఖ్య తగ్గిపోయి.. మరణించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ భిన్నమైన పరిస్థితికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఐరోపా ఖండంలోని 17 దేశాల్లో జననాల సంఖ్య బాగా తగ్గిపోయింది. గర్భం దాల్చే మహిళల సంఖ్య తగ్గిపోవటమే కాదు.. వృద్ధుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో.. మరణాల సంఖ్య ఇటీవల పెరుగుతోంది.
అమెరికాలో ఇందుకు భిన్నమైన పరిస్థితి చోటు చేసుకుంది.ఈ దేశంలో పుట్టే వారి సంఖ్య ఎక్కువగా.. మరణించే వారి సంఖ్య తక్కువగా ఉంటున్నట్లు తేలింది. ఐరోపాలోని దేశాల మాదిరే అమెరికాలోని చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే జననాల రేటు కంటే మరణాల రేటు ఎక్కువగా ఉందని.. మిగిలిన చోట్ల అంతా ఒకేలాంటి పరిస్థితి నెలకొని ఉండటం గమనార్హం.