Begin typing your search above and press return to search.

కరోనా కట్టడికి అమెరికా భారీ ప్యాకేజీ

By:  Tupaki Desk   |   27 March 2020 11:36 AM IST
కరోనా కట్టడికి అమెరికా భారీ ప్యాకేజీ
X
కరోనా వైరస్‌ మహమ్మారి జన్మస్థలం చైనాలో ఎంత తీవ్రంగా వ్యాపించిందో ప్రస్తుతం అమెరికాలో అంత కన్నా వైరస్‌ తీవ్రంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు మృతిచెందడం.. లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడంతో అమెరికా కరోనా నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు కరోనా నివారణకు మందుపై విస్తృతంగా పరిశోధనలు చేస్తూనే సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టింది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. రూ.1,500 లక్షల కోట్ల (రెండు లక్షల ట్రిలియన్‌ డాలర్ల) ప్యాకేజీ ప్రకటించడం విశేషం. దీనికి ఆ దేశ సెనేట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం విశేషం.

కరోనా నివారణకు తీసుకునే చర్యలు, కరోనా బాధితుల వైద్య సేవలు - లాక్‌ డౌన్‌ సందర్భంగా ఉపాధి కోల్పోతున్న వారికి - వైద్య సేవల మెరుగుకు - పేదలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ఈ మేరకు అమెరికా చర్యలు చేపట్టింది. అందుకోసమే భారీ ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. వెంటనే ఆ ప్యాకేజీ నుంచి కరోనా నివారణ చర్యలు తీసుకోనున్నారు. ప్రస్తుతం అమెరికాలో కరోనా విజృంభిస్తుండడంతో వ్యాప్తిని తగ్గించడం - కరోనా సోకిన వారికి పటిష్టమైన చర్యలు తీసుకోవడం వంటివి త్వరితగతిన చేపట్టేందుకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.