Begin typing your search above and press return to search.

టిక్‌ టాక్‌ కు భారీ షాక్‌ ఇచ్చిన అగ్ర రాజ్యం!

By:  Tupaki Desk   |   28 Dec 2022 1:30 PM GMT
టిక్‌ టాక్‌ కు భారీ షాక్‌ ఇచ్చిన అగ్ర రాజ్యం!
X
టిక్‌ టాక్‌ కు మరోసారి భారీ షాక్‌ తగిలింది. భద్రతాపరమైన సమస్యలతో, డేటా సేకరిస్తుందన్న కారణాలతో ఇప్పటికే భారత్‌ టిక్‌ టాక్‌ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈసారి అమెరికా వంతు వచ్చింది. అమెరికా టిక్‌ టాక్‌ పై నిషేధం విధించింది.

అయితే నిషేధం దేశ మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్‌లలో మాత్రమే వినియోగించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి మార్గదర్శకాల్ని విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌ టాక్‌ వినియోగించే అవకాశం కోల్పోనున్నారు.  

చైనాకు చెందిన బైట్‌ డ్యాన్స్‌ పరిధిలోనిది,, టిక్‌ టాక్‌. దీని వినియోగంతో సెక్యూరిటీ సమస్యలు ఉత్పన్నమవుతాయని అమెరికా ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేసింది. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా అమెరికా కాంగ్రెస్‌లో హౌస్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌ (ప్రతినిధుల సభ) టిక్‌ టాక్‌ను వినియోగించకుండా నిషేధం విధించింది. ఈ మేరకు హౌస్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటీవ్‌ ఆఫీసర్‌ (సీఏఓ) చట్టసభ సభ్యులు, ఇతర సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వారు టిక్‌ టాక్‌ను వినియోగించేందుకు అనువుగా ఉండే అన్నీ ఎలక్ట్రానిక్‌ పరికరాలలో యాప్‌ను డిలీట్‌ చేయాలని కోరారు.  

ఇప్పటికే గత వారం టిక్‌ టాక్‌ యాప్‌ సాయంతో అమెరికన్లు, ఇతర సంస్థలకు చెందిన అంతర్గత సమాచారాన్ని ట్రాక్‌ చేస్తుందని 19 రాష్ట్ర ప్రభుత్వాలు గవర్నమెంట్‌కు చెందిన డివైజ్‌లలో టిక్‌ టాక్‌ పనిచేయకుండా నిషేధం విధించాయి. సంబంధిత ఫైల్స్‌ మీద దేశాధ్యక్షుడు జోబైడెన్‌ సంతకం చేశారు. దీంతో ఈ నిషేధం వెంటనే అమల్లోకి రానుంది.

కాగా టిక్‌ టాక్‌ యాప్‌ వాడకుండా దేశవ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని యూఎస్‌ చట్టసభ సభ్యులు ప్రతిపాదన తెచ్చారు. అయితే జోబైడెన్‌ ప్రభుత్వం కేవలం ప్రతినిధుల సభ, వారి శాఖలకు చెందిన ఉద్యోగులు మాత్రమే టిక్‌టాక్‌ వినియోగించకుండా ఆంక్షలు విధించింది. కాగా, అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టిక్‌ టాక్‌ యాజమాన్యం బైట్‌డ్యాన్స్‌ ఇంతవరకు స్పందించలేదు  

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.