Begin typing your search above and press return to search.
భారతీయులకు అమెరికా బంఫర్ ఆఫరే!
By: Tupaki Desk | 11 Nov 2022 6:31 AM GMTభారతీయులకు ఇది నిజంగా బంఫర్ ఆఫరే. అమెరికా వీసాల కోసం నిరీక్షిస్తున్నవారికి ఆ దేశం శుభవార్త వినిపించింది. భారతీయులకు ప్రతి నెలా లక్ష వీసాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆ దేశ కార్యాలయం తాజాగా వెల్లడించింది. దీంతో అమెరికా వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయం వచ్చే 6–7 నెలల్లో గణనీయంగా తగ్గిపోతుందని ఆ దేశం ప్రకటించింది.
కాగా గత ఏడాది భారతీయులకు అమెరికా 82 వేల వీసాలిచ్చింది. వచ్చే జూన్ నాటికి ఈ సంఖ్య 11 లక్షల నుంచి 12 లక్షల వరకు చేరుతుందని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికా వీసాల మంజూరు విషయంలో భారతదేశానికే తమ తొలి ప్రాధాన్యం ఉంటుందని ఆ దేశం స్పష్టం చేసింది.
ఈ చర్యలతో అమెరికా వీసాలు అత్యధికంగా పొందుతున్న దేశాల్లో త్వరలోనే భారత్ రెండో స్థానంలోకి వస్తుందని ఆశిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం మెక్సికో, చైనా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొంది.
వీసాల మంజూరు విషయంలో కోవిడ్ రాక ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. అలాంటి పరిస్థితులకు తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని భారత రాయబార కార్యాలయం వివరించింది. వచ్చే ఏడాది మధ్య నాటికి ఇలాంటి పరిస్థితులను తీసుకువస్తామని పేర్కొంది.
వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సుదీర్ఘ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది సంఖ్యను కూడా పెంచుతున్నామని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. అంతేకాకుండా డ్రాప్ బాక్స్ విధానాన్ని కూడా ప్రవేశపెడుతున్నట్టు పేర్కొంది. డ్రాప్ బాక్స్ విధానంలో.. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు మాత్రమే ఇందుకు అర్హులు.
భారతీయులకు హెచ్ (హెచ్1బీ), ఎల్ కేటగిరీ వీసాల మంజూరును ప్రాధాన్య అంశంగా అమెరికా గుర్తించిందని రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉన్నత విద్య కోసం అమెరికా రావాలనుకునే విద్యార్థుల వీసాల జారీ సమయాన్ని కూడా తగ్గిస్తామని వివరించింది. ముఖ్యంగా వీసా రెన్యువల్‌కు ఇప్పటిదాకా ఎక్కువ సమయం పడుతుండటంతో దాన్ని తగ్గించాలనేది ప్రాధాన్య అంశంగా పెట్టుకున్నామని తెలిపింది.
వీసా రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవల దాదాపు లక్ష స్లాట్లను విడుదల చేశామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. కొన్ని వీసాల మంజూరుకు గతంలో 450 రోజులు పడుతుండగా.. దానిని 9 నెలలకు తగ్గించామని గుర్తు చేసింది. వ్యాపారం, టూరిజం అవసరాల కోసం బీ1, బీ2 వీసాల మంజూరు సమయాన్ని కూడా ఇంకా కుదించామని పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.