Begin typing your search above and press return to search.
హెచ్ 1బీ షాకిచ్చిలా నివేదిక: ఇక వారికి అతి తక్కువ చెల్లింపులు
By: Tupaki Desk | 6 May 2020 11:50 AM GMTకొత్త వీసా సంస్కరణలు, దేశంలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా హెచ్ 1 బీ వీసాదారులకు రెండు నెలల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా వారికి సంబంధించిన వేతనాల విషయంలో కీలక రిపోర్ట్ వచ్చింది. దీంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులంతా షాక్‌కు గురవుతున్నారు. దిగ్గజ కంపెలన్నీ తక్కువ (స్థానిక మధ్యస్థ) వేతనాలను చెల్లించాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికన్ టెక్నాలజీ సంస్థలైన ఫేస్‌బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ సహా ఇతర దిగ్గజ కంపెనీలు హెచ్ 1బీ నిపుణులకు మార్కెట్ వేతనాల కంటే తక్కువ చెల్లించాయని తాజా నివేదిక తెలిపింది.
హెచ్ 1బీ వీసాదారులను కలిగిన టాప్ 30 అమెరికా కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ సహా ప్రధాన సంస్థలు ఉన్నాయి. వీరందరూ హెచ్ 1బీ ఉద్యోగుల్లో చాలామందికి స్థానిక సగటు కంటే తక్కువ జీతాలను చెల్లించాయట. స్థానిక వేతనాల కంటే తక్కువ జీతాల చెల్లింపుపై చట్టబద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించుకుని ఇలా చేశాయని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
హెచ్ 1బీ వీసాలు, ప్రస్తుత వేతన స్థాయిలు అనే పేరుతో డేనియల్ కోస్టా, రాన్ హీరా ఓ నివేదిక విడుదల చేశారు. యూఎస్ కార్మిక శాఖ (డీఓఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1బీ వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనం కంటే చాలా తక్కువ వేతన స్థాయిలను అందించాయని నివేదికలో ఉంది. నిబంధనలను మార్చే అధికారం డీఓఎల్‌కు ఉన్నప్పటికీ అలా చేయలేదని తేలింది.
2019 లో 53 వేలకు పైగా కంపెనీలు హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించగా, 2019లో యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించిన 3,89,000 హెచ్ 1బీ ఉద్యోగుల టాప్ 30 కంపెనీలు నాలుగింటిలో ఒకటి ఉంది. టాప్ 30 కంపెనీల్లో సగానికి పైగా అత్యధిక ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయని నివేదికలో తెలిపారు. అయితే టెక్ కంపెనీలు నేరుగా నియమించుకుంటున్నా వేతనాలు మాత్రం లెవల్ 1, లేదా లెవల్ 2 స్థాయిలోనే ఉన్నాయని నివేదించారు.