Begin typing your search above and press return to search.
భారత్ పై అమెరికా అప్రకటిత ‘బ్యాన్’?
By: Tupaki Desk | 3 March 2017 5:44 AM GMTమెజార్టీ ముస్లింలున్నఎనిమిది దేశాల మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్యాన్ విధించటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే. అయితే.. ఎలాంటి ప్రకటన లేకుండా.. మన దేశం మీదా అమెరికా అప్రకటిత బ్యాన్ పెట్టిందా? అంటే అవుననే చెప్పాలి. ఏడాదికేడాది అమెరికాకు వెళ్లేందుకు జారీ చేసే వీసాల విషయంలో సానుకూలంగా ఉండేస్థానే.. ఈ ఏడాది భారీగా కోత పెట్టిన వైనం గణాంకాలతో సహా బయటకు వచ్చింది.
ఎప్పటి మాదిరిగా ఉంటే.. ఫిబ్రవరి నాటికి జారీ చేయాల్సిన వీసాల లెక్కను.. తాజా లెక్కతో పోల్చి చూస్తే.. అసలు విషయం ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. బ్యాన్ ఏమీ లేనప్పటికీ.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎంతగా మారిపోయాయన్న దానికి వీసాల జారీని ఉదాహరణగా చెప్పొచ్చు. తమ దేశంలోకి విదేశీయుల రాకను కట్టడి చేస్తూ.. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాన్ని చూస్తే.. భారత్ మీదా అప్రకటిత బ్యాన్ ను విధించారా? అన్న భావన కలగటం ఖాయం.
అమెరికా వీసాల్ని ప్రతి ఏటా నాలుగు దఫాలుగా జారీ చేస్తుంటారు. ఇందులో భాగంగా2016 -17 సంవత్సరానికి సంబంధించిన వీసాల జారీ కార్యక్రమం మొదలైంది. 2016 అక్టోబరు నుంచి 2017 ఫిబ్రవరి వరకూ లెక్కల్ని చూస్తే.. భారతీయులకు జారీ చేసిన వీసాలు కేవలం 8 వేల నుంచి 9 వేల వరకూ మాత్రమే కావటం గమనార్హం. సాధారణంగా ఇదే సమయంలో తక్కువలో తక్కువ 30 వేల నుంచి 40వేల వరకూ వీసాల్ని జారీ చేస్తుంటారు. గత ఏడాది ఇదే సమయానికి జారీ చేసిన వీసాలతో పోల్చినప్పడు ఈ ఏడాది జారీ చేసిన వీసాలు కేవలం నాలుగో వంతే కావటం మర్చిపోలేం.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది అమెరికా జారీ చేసే వీసాల్లో భారీ కోత పడటం ఖాయమన్న అభిప్రాయం కలుగుతోంది. వీసాల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించటం.. అర్హత ఉన్నప్పటికి సంబంధంలేని ప్రశ్నలు సంధించి.. వీసాలు రిజెక్ట్ చేస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోందని చెబుతున్నారు. 2015-16 లో 1.65 లక్షల వీసాలు మంజూరు కాగా.. ఈ ఏడాది 40వేలకు మించి వీసాలు జారీ అయ్యే అవకాశాలు కనిపించటం లేదని చెబుతున్నారు.
గణాంకాల్ని పరిశీలిస్తే.. 2015 ముందు కూడా ఏటా లక్షకు తగ్గకుండా వీసాల్ని జారీ చేసేవారు. దీంతో పోల్చినప్పుడు ఈ ఏడాది వీసాల జారీలో భారీ కోత పడటం ఖాయమనే చెప్పాలి. హెచ్ 1 బీ వీసాలు మంజూరు చేయాల్సిన కంపెనీలు సైతం గతంలో మాదిరి వ్యవహరించటం లేదని.. ఆచితూచి మాత్రమే స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. హెచ్ 1బీ వీసాల కోసం జారీ చేసే కంపెనీల మీదకూడా అమెరికా అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో.. కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామాలతో అమెరికా వీసా కోసం కలలు కనటం కాస్త ఆపితే నిరాశ.. నిస్పృహలు ఎదురు కాకుండా ఉంటాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/