Begin typing your search above and press return to search.
పాక్ కు అమెరికా షాక్..మనకు ఎఫ్24 విమానాలు
By: Tupaki Desk | 3 March 2019 4:53 PM GMTఉగ్రవాదం అండగా పేట్రెగిపోతున్న పాక్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఉగ్రవాదులపై పోరాడేందుకు ఉపయోగించాల్సిన ఎఫ్-16 యుద్ధ విమానాలను భారత్‌పై దాడులకు ఉపయోగించిన పాకిస్థాన్ పై అమెరికా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ విమానాలను దుర్వినియోగం చేయడంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్‌కు స్పష్టం చేసింది. తమతో కుదుర్చుకున్న వినియోగ ఒప్పందాన్ని (ఎండ్ యూజర్ అగ్రిమెంట్ ను) పాక్ ఉల్లంఘించి ఈ విమానాలను భారత్ కు వ్యతిరేకంగా ఉపయోగించడంతో ఈ సమాచారాన్ని అడిగినట్టు అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద స్థావరాలపైనే ఎఫ్-16 యుద్ధ విమానాలను ప్రయోగిస్తామన్న పాక్ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. భారత వైమానిక స్థావరాలపై దాడి చేయడాన్ని తప్పు బట్టిన అమెరికా.. పాక్ ను వివరణ కోరింది. దీనికి కొనసాగింపుగా భారత్‌కు ఎఫ్-16 సరపరా చేయాలని సన్నద్ధమవుతోంది.
అమెరికాలో తయారైన ఎఫ్-16 యుద్ధ విమానాలను ఉపయోగించుకొని బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా కశ్మీర్ లో భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగింది. ఈ విషయాన్ని రుజువుచేసి పాక్ బండారాన్ని బట్టబయలు చేసేందుకు గురువారం భారత వాయుసేన (ఐఏఎఫ్) సదరు ఎఫ్-16 నుంచి పాక్ పైలట్లు ప్రయోగించిన అమ్రామ్ క్షిపణి భాగాలను బహిరంగపరిచింది. ఈ పరిణామాల గురించి తమకు తెలుసని, ఎఫ్-16 యుద్ధ విమానాల దుర్వినియోగంపై మరింత సమాచారాన్ని అందజేయాల్సిందిగా పాకిస్థాన్ కు స్పష్టం చేస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
దీనికి తోడుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్–16 విమానాలను పాకిస్థాన్ బయట ఉపయోగించాలన్నా.. సైనిక విన్యాసాల్లో వినియోగించాలన్నా - మూడో దేశంపై ప్రయోగించాలన్నా ముందుగా అమెరికా అనుమతి తీసుకోవాలి. కానీ అవేవి లేకుండానే ఇమ్రాన్ సర్కార్ అత్యూత్సాహం ప్రదర్శించడంపై గుర్రుగా ఉన్నారు ట్రంప్. దీనికి కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని పాక్ కు ట్రంప్ ఆదేశించారు. ఏకంగా ట్రంప్ రంగంలోకి దిగి ఈ ఆర్డర్ వేయడం వెనుక కారణం అమెరికా సంస్థల రూ.1.4లక్షల కోట్ల వ్యాపారమని తెలుస్తోంది.
భారత్- పాక్ యుద్ధంలో తమ వ్యాపార కోణం చూసి పాక్ కలవరం చెందుతోంది. పోరులో కుప్పకూలిన రెండు విమానాల్లో ఒకటి భారత్ మిగ్ కాగా - రెండోది పాకిస్తాన్ కు చెందిన ఎఫ్ 16 విమానం. ఎఫ్-16ను అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ సంస్థ తయారుచేస్తోంది. ఓ పాత మిగ్ విమానం ఆధునిక ఎఫ్ 16ను కూల్చి వేయడంతో తమపై ప్రభావం పడుతుందని లాక్ హీడ్ ఆందోళన చెందుతోందట. ఇది లాక్ హీడ్ కు భారీ షాక్ అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో భారత్‌కు తమ ఉత్పత్తులను అమ్మి నష్ట నివారణ చేసుకోవాలని భావిస్తోంది. లాక్‌హీడ్ సంస్థ ఎఫ్ 21ను భారత్‌కు సరఫరా చేయాలని చూస్తోంది.