Begin typing your search above and press return to search.
నో చెప్పాం... గో బ్యాక్ అనలేదు
By: Tupaki Desk | 23 Jan 2016 7:47 AM GMTతెలుగు రాష్ట్రాల విద్యార్థులను అమెరికాలో ప్రవేశించకుండా వెనక్కిపంపించడంపై కొద్దికాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అమెరికా ఎంబసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులను తాము వెనక్కి పంపించలేదని.. అమెరికాలోకి ప్రవేశం కుదరదని మాత్రమే చెప్పామని అమెరికా ఎంబసీకి చెందిన మినిస్టర్ కౌన్సిలర్ ఫర్ కాన్సులర్ అఫైర్స్ పాంపర్ ప్రకటించారు. అంతేకాదు..... విద్యార్థులను వేధించారనడం కూడా నిజం కాదని... అవి తప్పుడు ఆరోపణలని ఆయన చెప్పారు. దీనిపై ఆయన శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ అన్ని వివరాలూ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు బలవంతంగా వెనక్కిపంపించారన్నది వాస్తవం కాదని ఆయన స్పష్టంచేశారు. శాన్ జోస్ లోని సిలికాన్ వ్యాలీ విశ్వవిద్యాలయం, ఫ్రెమంట్ లోని నార్త్ వెస్టర్న్ పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులే ఎక్కువ మంది తిరిగి వచ్చినప్పటికీ... ఆ రెండు విశ్వవిద్యాలయాలను అమెరికా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో ఉంచిందన్న విషయమూ నిజం కాదని ఆయన చెప్పుకొచ్చారు.
అమెరికా అయినా, భారత్ లో అయినా ఆ దేశం ఇచ్చే వీసా ఒక్కటే సరిపోదని... వీసా అంటే కేవలం ఆ దేశంలోకి ప్రవేశించడానికి ఒక అనుమతి మాత్రమేనని తెలిపారు. అక్కడ ఆ వ్యక్తిని దేశంలోకి అనుమతించాలా వద్దా అనే అంశం కస్టమ్స్ - బోర్డర్ కంట్రోల్ - ఇమ్మిగ్రేషన్ తదితర అనేక విభాగాలకు చెందిన అధికారులు నిర్ణయిస్తారని చెప్పారు. తెలుగు విద్యార్థులకు ప్రవేశ అనుమతి నిరాకరించడానికి ఆ విశ్వవిద్యాలయాలు కారణమే కాదని చెప్పారు. అంతేకాదు... వెనక్కి వచ్చిన విద్యార్థులు తమను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు వేధించారని చెప్పడం కూడా నిజం కాదని ఆయన చెప్పుకొచ్చారు.