Begin typing your search above and press return to search.

చైనా కొత్త అస్త్రమిదే.. అమెరికా బెంబేలు..

By:  Tupaki Desk   |   28 Aug 2019 11:32 AM GMT
చైనా కొత్త అస్త్రమిదే.. అమెరికా బెంబేలు..
X
ఇప్పుడు యుద్ధం మారింది. కొత్త రకం యుద్ధాన్ని అమెరికా దాని వైరిపక్షాలు మొదలు పెట్టాయి. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికా- రష్యా ప్రచ్చన్న యుద్ధం చేశాయి. ఒకరిని మించి ఒకరు అణ్వాయుధాలు తయారు చేసి యుద్ధోన్మాదం చేశాయి. అయితే తర్వాతి కాలంలో రష్యా బలహీన పడి అమెరికా ప్రపంచ పెద్దన్నగా తిరుగులేని శక్తిగా అవతరించింది.

అయితే ఇప్పుడు అమెరికాతో పోటీకి చైనా రెడీ అయ్యింది. వాయువేగంతో పారిశ్రామిక వృద్ధి సాధించిన చైనాను అడ్డుకట్ట వేసేందుకు అమెరికా ఆంక్షలు విధించింది. చైనా ఉత్పత్తులపై భారీగా పన్ను విధించింది. ఇది చైనా ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తున్నా వెనుకాడడం లేదు. ఇప్పుడు అమెరికా- వర్సెస్ చైనా వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తోంది.

అయితే ఇప్పుడు అమెరికా - చైనాలు మిస్సైల్- అణ్వాయుధ యుద్ధానికంటే కూడా కృత్రిమ మేధస్సు- అంతరిక్షం- హైపర్ సోనిక్ ఆయుధాలు సమకూర్చుకుంటూ ప్రచ్చన్నయుద్ధాన్ని టెక్నాలజీతో చేయడం మొదలు పెట్టాయి. ఇప్పుడు ఈ కృతమ మేధస్సు యుద్ధంలో అమెరికా- చైనాలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు యుద్ధం చేస్తున్నాయి.

ఈ టెక్నాలజీలో భాగంగా హైపర్ సోనిక్ విమానాలు, క్షిపణులు, నెలలు ఆకాశంలో ఉండే డ్రోనులు- రొబోట్లు తయారు చేయడంలో అమెరికా, చైనా నువ్వానేనా అన్నట్టు పోటీపడుతున్నాయి. అమెరికా కంటే ఎక్కువగా ఈ రంగంపై చైనా ఖర్చు చేస్తూ పరిశోధన చేస్తోంది. అమెరికాను బీట్ చేసేందుకు అడుగులు వేస్తోంది.

ఇప్పుడు ప్రపంచంలోనే రక్షణకు అత్యధిక బడ్జెట్ కేటాయించిన దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది.ట్రంప్ భారీగా సైన్యానికి నిధులు ఇస్తున్నారు. ఇక అమెరికా తర్వాత చైనా రెండో స్థానంలో ఉంది. రష్యా మూడో స్థానంలో ఉంది. రష్యా- చైనా జట్టుకడుతున్న వేళ భారత్ తో కలిసి చైనాను నిలువరించే వ్యూహంతోనే అమెరికా ఈ కృతిమ మేధస్సులో అపార మేథో సంపత్తిని ఉన్న భారతీయులను భాగస్వాములు చేయాలని యోచిస్తోందట... భారత్ తో కలిసి చైనాకు చెక్ పెట్టడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.