Begin typing your search above and press return to search.
హాట్ టాపిక్ గా మారిన రూ.19కోట్ల కారు
By: Tupaki Desk | 24 Aug 2017 12:30 AM GMTఖరీదైన కారు ఎంత రేటు ఉండొచ్చు? రూ.5 కోట్లు.. రూ.10 కోట్లు. అంతకంటే ఆలోచించాలంటే కాస్త కష్టమే. కానీ.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ధర రూ.19.21 కోట్లు. ఖరీదైన కార్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే బుగాట్టీ ఈ కారును రూపొందించింది. చిరాన్ పేరుతో మార్కెట్ లోకి తెచ్చిన ఈ కారే ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుగా చెబుతున్నారు.
గంటకు 420 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కారును బుగాట్టీ కేవలం 500 కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనుంది. లిమిటెడ్ ఎడిషన్ లో మార్కెట్లోకి రానున్న ఈ సిరీస్ లో మొదటి కారు తాజాగా రోడ్డు మీదకు వచ్చేసింది. అమెరికాకు చెందిన షెబల్ బీచ్ కు చెందిన ఒక కస్టమర్ కు మొదటి కారును డెలివరీ చేశారు. బుగాట్టీ తయారు చేసే 500 కార్లలో ఇప్పటికే 250 కార్లు బుక్ అయినట్లుగా చెబుతున్నారు. మొదటికారును పసుపు.. నలుపు రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా తయారు చేశారు. రోడ్డు మీదకు వచ్చిన ఈ కారు పెబల్ బీచ్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
చూపరులను విపరీతంగా ఆకర్షిస్తోన్న ఈ కారు స్పెషాలిటీస్ విషయానికి వస్తే.. 1600 ఎన్ ఎం టార్క్ వద్ద 1500 బీహెచ్ పీ శక్తిని విడుదల చేయనుంది. అత్యంత సౌకర్యవంతమైన ఇంటీరియర్ తో దీన్ని తీర్చిదిద్దారు. 8 లీటర్ డబ్ల్యూ 16 ఇంజిన్ ను వినియోగించారు. రెండు దశల టర్బో ఛార్జర్ ఇంజిన్ ను తొలిసారి ఈ కార్లలో బుగాట్టీ వినియోగిస్తోంది. క్షణాల్లో వాయు వేగంతో దూసుకెళ్లే ఈ కారు.. గంటకు 400 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళుతున్నా.. డ్రైవర్‌కు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.