Begin typing your search above and press return to search.
అబార్షన్ హక్కుల కోసం అమెరికాలో పాదయాత్ర!
By: Tupaki Desk | 4 Oct 2021 5:41 AM GMTఅబార్షన్ హక్కులకు మద్దతుగా అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలలోనూ వేలాదిమంది ర్యాలీలు నిర్వహిస్తున్నారు.ఇటీవల, అబార్షన్ పై పరిమితులు విధిస్తూ టెక్సాస్ రాష్ట్రంలో ఓ కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడంతో దేశమంతటా నిరసనలు వెల్లువెత్తాయి. ఇలాంటి చట్టాల వలన రాజ్యాంగపరమైన హక్కులకు భంగం కలుగుతుందని స్వేచ్ఛావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో 1973లో దేశవ్యాప్తంగా గర్భస్రావాలను చట్టబద్ధం చేశారు. రో వీ వేడ్ అని పిలిచే ఈ చట్టాన్ని తిరస్కరిస్తూ దాఖలు చేసిన కేసుపై రాబోయే నెలల్లో సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
అబార్షన్ హక్కు కల్పించాలంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీని కంటే ఒక రోజు ముందే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అబార్షన్ చట్టాన్ని మరింత కఠినతరం చేయాలంటూ ఫెడరల్ జడ్జిని ఆదేశించారు. ఫలితంగా సెప్టెంబర్ లో టెక్నాస్ వ్యాప్తంగా బోలెడు అబార్షన్లు నిషేదించారు అధికారులు. ఈ రూల్స్ వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా ఉన్నాయని మహిళలు పాదయాత్ర చేశారు. వైట్ హౌజ్ కు సమీపంలో చేపట్టిన పాదయాత్రలో పదివేల మందికి పైగా పాల్గొన్నారు. అబార్షన్ చేసుకున్నవాళ్లంటే ఇష్టం, అబార్షన్ అనేది పర్సనల్ ఛాయీస్, ఇది లీగల్ డిబేట్ కాదు అంటూ ప్లకార్డులతో కనిపించారు.
చాలా మంది అమెరికా సుప్రీం కోర్టు లేట్ జస్టిస్ రూత్ బ్యాడర్ గిన్స్ బర్గ్ పోలిన దుస్తుల్లో కనిపించారు. క్షమాపణలు అడగకుండా అబార్షన్ చేసుకునేందుకు వీలుండాలి. తిరుగుబాటు ఒక్కటే దీనికి మార్గం. అంటూ నినాదాలు చేయగా..మొత్తం అబార్షన్ హక్కుల కోసం దేశవ్యాప్తంగా 660చోట్ల ఆందోళనలు జరిగాయి. అదృష్టవశాత్తు, అలాంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం నాకు కలుగలేదు. కానీ, ఎంతోమంది మహిళలు ఆ పరిస్థితిని ఎదుర్కొంటారు. మా శరీరాల గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రభుత్వానికిగానీ, పురుషులకుగానీ లేదు అని రాబిన్ హార్న్ అనే మహిళ రాయిటర్స్ వార్తాసంస్థతో అన్నారు.
వార్షిక వుమన్స్ మార్చ్ నిర్వహించేవారే ఈ ర్యాలీలనూ నిర్వహించారు. వీరి మొదటి ర్యాలీ 2017లో డోనాల్డ్ ట్రంప్ పదవిని చేపట్టిన మరుసటి రోజు మొదలైంది. ఆ ర్యాలీలో లక్షలాదిమంది పాల్గొన్నారు. ఇది అందరికీ అద్దాలను పగలగొట్టుకుని ముందుకు దూకే క్షణం లాంటిది అని వుమన్స్ మార్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేచెల్ ఓ లియరీ కార్మోనా అన్నారు. అబార్షన్ చట్టబద్ధం అని, అందరికీ అందుబాటులో ఉంటుందనే ఆలోచనతోనే మేమంతా పెరిగాం. అది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇది అందరికీ మేలుకొలుపు లాంటిది అని ఆమె అన్నారు. న్యూయార్క్ రాష్ట్రంలో గవర్నర్ కాథీ హోచుల్ రెండు ర్యాలీలలో మాట్లాడారు. అబార్షన్ హక్కుల విషయంలో పోరాడి, పోరాడి అలిసిపోయాను. అది ఒక చట్టంగా ఈ దేశంలో స్థిరపడిపోయింది. ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఆ హాక్కును మా నుంచి మీరు లాక్కోలేరు అని ఆమె స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 1 నుంచి అబార్షన్ హక్కును రద్దు చేశారు. కడుపులో బిడ్డ గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తరువాత గర్భస్రావం చేయించుకోకూడదని చట్టం తీసుకువచ్చారు. అయితే, ఆ సమయానికి తాను తల్లి కాబోతున్నట్లు మహిళలకు తెలియకపోవచ్చు.
ఈ హార్ట్‌బీట్ చట్టం కింద గర్భం దాల్చిన ఆరు వారాల తరువాత అబార్షన్ చేసే డాక్టర్ మీద కూడా కేసు వేయవచ్చు. కడుపులో బిడ్డలను కాపాడడమే ఈ చట్టం లక్ష్యమని సమర్థకులు అంటున్నారు.ఇతర రిపబ్లికన్ ఆధిపత్య రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు కూడా ఈ అబార్షన్ చట్టాన్ని అమలుచేసే ఆలోచనలో ఉన్నారు.టెక్సాస్ చట్టాన్ని నిరోధించాలని హక్కుల సంఘాలు సుప్రీం కోర్టును కోరాయి. కానీ, న్యాయమూర్తులు వారి డిమాండ్‌ను తిరస్కరించారు. మిస్సిస్సిపీలో 15 వారాల తరువాత అబార్షన్ చేయించుకోకూడదనే చట్టం ఉంది. దానిపై డిసెంబర్ 1న సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.