Begin typing your search above and press return to search.
ఎఫ్ 1 వీసాపై భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా..!
By: Tupaki Desk | 27 Dec 2022 7:33 AM GMTఅగ్రరాజ్యం అమెరికా ఎఫ్ 1 వీసా ఇంటర్వ్యూల్లో తొలిసారి ఫెయిల్ విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చింది. ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వం భారతీయ విద్యార్థులు ఫాల్ సీజన్ కు సంబంధించి ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని తాజాగా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే స్లాట్ తేదిలను ఖరారు చేయనున్నట్లు గుడ్ న్యూస్ వెల్లడించింది.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే చాలామంది విద్యార్థులు వీసా విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. వీసా ప్రాసెస్ లో భాగంగా ఒకసారి ఇంటర్వ్యూలో ఫెయిలైతే వారికి మరోసారి అవకాశం ఉండకపోవడంతో చాలామంది విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు.
ఈ విషయంపై భారతీయ విద్యార్థులు చాలా రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవల హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మొదటిసారి వీసా ఇంటర్వూలో ఫెయిల్ విద్యార్థులకు మరొక ఇంటర్వ్యూ అవకాశాన్ని కల్పించేలా అమెరికా తాజాగా నిర్ణయించింది.
ఇందులో భాగంగా ఫాల్ సీజన్‌కు సంబంధించి ఢిల్లీలోని అమెరికా ఎంబసీ కార్యాలయంతో పాటు ముంబై.. కోల్‌కతా.. హైదరాబాద్.. చెన్నై కాన్సులేట్ కార్యాలయాల్లో విద్యార్థి వీసా ఎఫ్-1 దరఖాస్తుల తతంగంపై దృష్టిసారించింది. ఈ వారం ముగిసేలోపు పూర్తి ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అమెరికా ఎంబీసీ అధికారులు పేర్కొన్నారు.
దీంతో ఈ దఫా ఇంటర్వ్యూలు ముగిసిన తర్వాత ఇంతకు ముందు ఇంటర్వ్యూలో ఫెయిలైన విద్యార్థులకు మరొక ఇంటర్వ్యూకి హాజరయ్యే అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన ఇంటర్వ్యూ తేదీల స్లాట్లు తేదీలను వచ్చే నెలలో విడుదల చేసేందుకు అమెరికా అన్ని ఏర్పాట్లు చేసింది.
కాగా గతేడాది నుంచి ఒక సీజన్లో ఒక దఫా మాత్రమే ఇంటర్వ్యూ స్లాట్ పొందే అవకాశం ఉండేది. అమెరికా ప్రత్యేకంగా అనుమతి ఇస్తే తప్ప మరో అవకాశం విద్యార్థులకు ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే జో బైడెన్ ప్రభుత్వం ఎఫ్ 1 వీసా ప్రక్రియలో పలు మార్పులు చేయడంతో భారతీయ విద్యార్థులకు మరొక అవకాశం దక్కింది. దీంతో అమెరికాలో చదవాలనే విద్యార్థులు కలలు మరింతగా సఫలం కానున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.