Begin typing your search above and press return to search.
భారత్ బయోటెక్ కి షాక్ ఇచ్చిన అమెరికా...ఏమైందంటే ?
By: Tupaki Desk | 11 Jun 2021 8:30 AM GMTకరోనావైరస్ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ ను కనిపెట్టిన భారత్ బయోటెక్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వినియోగాన్ని అమెరికా తిరస్కరించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ యాజమాన్యం దాఖలు చేసిన ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తాము గుర్తించట్లేదని ప్రకటించిన అతి కొద్దిరోజుల్లోనే ఈ పరిణామం సంభవించింది. దీనికి ప్రధాన కారణం చాలా ఆలస్యంగా దరఖాస్తులు చేసుకోవడమేనని తెలుస్తుంది. అమెరికాలో కోవాగ్జిన్ వినియోగానికి భారత్ బయోటెక్ యాజమాన్యం అమెరికన్ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ఆక్యుజెన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అమెరికాలో కోవాగ్జిన్ దిగుమతి చేసుకోవడం మొదలుకుని దాన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినియోగించేంత వరకు అవసరమైన కార్యకలాపాలన్నింటినీ ఆక్యుజెన్ పర్యవేక్షిస్తుంది.
తెలుగువాడైన శంకర్ ముసునూరి స్థాపించిన ఫార్మా కంపెనీ ఇది. అమెరికాలో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో రెండు టీకాలను వినియోగిస్తోంది. ఫైజర్, మోడెర్నా వినియోగంలో ఉన్నాయి. దీనికి అదనంగా కోవాగ్జిన్ కు కూడా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ భారత్ బయోటెక్ తరఫున ఆక్యుజెన్, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. వాటిని పరిశీలించిన తరువాత మరింత అదనపు సమాచారం ఇవ్వాలని యూఎస్ ఎఫ్ డీఏ ఆదేశించింది. దీన్ని సకాలంలో దాఖలు చేయకపోవడం వల్లే అనుమతి ఇవ్వలేదు. అత్యవసర వినియోగానికి అవసరమైన బయోలాజికల్ లైసెన్స్ అప్రూవల్ కోసం కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్ ను అందజేయాల్సి ఉంటుందంటూ ఎఫ్ డీఏ సూచించినట్లు ఆక్యుజెన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శంకర్ ముసునూరి తెలిపారు. ఈ మేరకు న్యూయార్క్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యంత కీలకమైన మూడోదశకు చెందిన క్లినికల్ ట్రయల్స్ ను భారత్ బయోటెక్ యాజమాన్యం ప్రకటించట్లేదంటూ భారత్ లోనూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.