Begin typing your search above and press return to search.
దాయాదికి ‘ఒబామా’ షాకింగ్ ఆర్థిక సాయం
By: Tupaki Desk | 29 April 2016 4:59 AM GMTనిజానికి ఏమాత్రం సంబంధం లేని పోలిక ఇది. కానీ.. లోతుగా వెళ్లి ఆలోచిస్తే విషయం ఇట్టే అర్థమవుతుంది. ఏపీ ఎంతగా నష్టపోతుందో తెలుస్తుంది. సోనియా సర్కారు తన ఇష్టానికి తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ఏపీ ప్రజలు ఎంతలా నష్టపోతున్నవిషయం అర్థం కావటమే కాదు.. తాజాగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలకు కారణం..విభజన తర్వాత మోడీ సర్కారు వ్యవహరిస్తున్న వైఖరేనని చెప్పక తప్పదు. కాస్త చిత్రంగా అనిపించే ఈ పోలికను చూస్తే.
దాయాది దేశానికి అమెరికా మధ్య అనుంబంధం అందరికి తెలిసిందే. అయితే.. ఈ స్నేహం కేవలం మాటలకే పరిమితం కాలేదని.. చేతల్లోనూ చాలానే ఉందన్న విషయం అర్థం చేసుకోవటనికి తాజాగా బయటకు వచ్చిన లెక్కకు మించింది మరొకటి ఉండేదమో? 2001 నుంచి ఇప్పటివరకూ అంటే.. దాదాపు 15 ఏళ్ల వ్యవధిలో పాకిస్థాన్ కు అమెరికా చేసిన ఆర్థిక సాయాన్ని రూపాయిల్లో చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఒక బుజ్జి దేశానికి వ్యూహాత్మక స్నేహం కోసం పెద్దన్న పెట్టిన ఖర్చు ఇంత భారీగా ఉంటుందా? అని అనుకోవాల్సిందే. 2011 సెప్టెంబర్ దాడుల తర్వాత నుంచి ఇప్పటివరకూ పాకిస్థాన్ కు సాయం పేరిట అమెరికా స్నేహంగా ఇచ్చిన డబ్బు విలువ అక్షరాల రూ.1.65లక్షల కోట్ల కంటే ఎక్కువని చెబుతున్నారు. ఈ అంకెల్ని అమెరికాకు చెందిన నేతలు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనాల్డ్ ట్రంప్ పాక్ కు అమెరికా చేస్తున్న సాయాన్ని ప్రశ్నించారు. పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్.. తాను అధ్యక్షుడ్ని అయితే మాత్రం పాక్ లాంటి దేశాలకు అయాచిత సాయం అందే అవకాశం లేదని చెప్పటం గమనార్హం. ఎలాంటి ఫలితం ఆశించకుండా ఒబామా ప్రభుత్వం బిలియన్ డాలర్లు పాక్ కు సాయం చేయటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకూ ఫలితం ఆశించకుండా సాయం చేసిందని.. ఇకపై అలాంటిది జరగదని ట్రంప్ వ్యాఖ్యానించటం గమనార్హం
అమెరికా.. పాక్ పంచాయితీల్ని పక్కన పెట్టి ఇదే విషయాన్ని మన లోకల్ పాలిటిక్స్ కు అన్వయించి చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ రెండు సంబంధం లేని వాదనలైనప్పటికీ.. పోలికలు పోల్చినప్పుడు ఏపీ ప్రజలు ఎంత దారుణంగా నష్టపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. తమ దేశం కాని దేశమైన పాక్ కు.. ఫ్రెండ్ షిప్ కోసం అమెరికా అంతేసి సాయం చేస్తే.. దేశంలో భాగమైన ఏపీకి కేంద్రం ఎంత సాయం చేయాలి? మామూలుగా అయితే.. ఒక రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా సాయం చేయాలంటూ అడగాల్సిన అవసరం లేదు.
కానీ.. ఏపీది అందుకు భిన్నమైన పరిస్థితి. తమకు ఏ మాత్రం ఇష్టం లేని విభజనను చేసిన కేంద్రం కారణంగా ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. కేంద్రం తీసుకున్న నిర్ణయం కారణంగా ఆర్థికంగా బలమైన మూలాలున్న ఏపీ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలిసిందే. అలాంటప్పుడు ఏపీ లాంటి రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ తరహా దన్ను లభించాలి..?
వ్యూహాత్మకం స్నేహం కోసం ఒక దేశానికి మరో దేశం రూ.1.65లక్షల కోట్ల సాయం చేసినప్పుడు.. విభజన కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న దేశంలోని ఒక రాష్ట్రానికి కేంద్రం ఎంతలా సాయం చేయాలి? మరెంత అండగా నిలవాలి? కానీ.. అలాంటిదేమీ లేకుండా రిక్త హస్తాలు చూపుతున్న మోడీ కారణంగా ఏపీ ఎంతగా నష్టపోతుందో ఈ ఉదాహరణతో ఇట్టే అర్థం కాక మానదు. పరాయి దేశం మీద పెద్దన్నకున్న ప్రేమతో పోలిస్తే.. దేశంలో భాగమైన ఏపీ పట్ల కేంద్రం చూస్తున్న చిన్నచూపు ఇట్టే అర్థం కాక మానదు. పోలిక సంబంధం లేకున్నా..‘సాయం’ కోణంలో చూస్తే విషయం ఇట్టే అర్థం కాక మానదు.