Begin typing your search above and press return to search.
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అమెరికా గొప్ప శుభవార్త
By: Tupaki Desk | 17 Oct 2022 8:38 AM GMTఅమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అమెరికా గొప్ప శుభవార్త చెప్పింది. అమెరికా వీసా కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసే వారి నిరీక్షణకు అమెరికా తెరదించింది. వర్క్ వీసాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించాలని చూస్తున్న చాలా మంది భారతీయులకు పండుగ సీజన్ లో శుభవార్త అందించింది.
అమెరికా మిషన్ హెచ్ అండ్ ఎల్ విభాగంలో కార్మికులు మరియు వారి కుటుంబాల కోసం 1 లక్షకు పైగా వీసాలను జారీ చేసింది. ఈ మేరకు అపాయింట్‌మెంట్‌లను విడుదల చేసింది. ఇతర దేశాల నుంచి కాకుండా.. భారతీయులు ఎక్కువగా పని ఆధారిత వీసాల ద్వారా అమెరికాలోకి ప్రవేశిస్తారు. కష్టపడి పనిచేస్తారని భారతీయులకు పేరుంది. దీంతో అమెరికాలో ఏ సమయంలోనైనా వారికి భారీ డిమాండ్ ఉంది.
ఇక భారతీయులకు అమెరికాపై బోలెడంత మమకారం ఉంది. వేలకొద్దీ దరఖాస్తులు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇంటర్వ్యూ మినహాయింపు.. మొదటిసారి అపాయింట్‌మెంట్‌ల కోసం వేచి ఉండే సమయం సగానికి తగ్గించబడింది. అమెరికా మిషన్ టు ఇండియా వారు వీసా అపాయింట్‌మెంట్‌ల కోసం 'H&L' ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగిస్తామని చెప్పారు.
సాధారణ రోజుల్లో హెచ్ వీసాలు అత్యంత ప్రాధాన్యతనిస్తాయి. విదేశీ కంపెనీలలో ఉపాధిని కోరుకునే నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికులకు ఇవి ఇస్తారు. మరోవైపు.. ఎల్ వీసాలు ఒక మేనేజర్, ఎగ్జిక్యూటివ్ లేదా ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని అమెరికాకు బదిలీ చేయడానికి విదేశీ కంపెనీలను అనుమతిస్తాయి. న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ, చెన్నై, హైదరాబాద్, కోల్‌కత్తా మరియు ముంబైలోని కాన్సులేట్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఇన్-పర్సన్ B1/B2 వీసా అపాయింట్‌మెంట్‌లను తిరిగి ప్రారంభించాయి.
ఇక F, H-1, H-3, H-4, నాన్-బ్లాంకెట్ L, M, O, P, Q మరియు అకడమిక్ J వీసాల కోసం దరఖాస్తు చేసుకునే ప్రయాణికులకు కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా ప్రభుత్వాధికారులు తెలిపారు. అమెరికా దేశానికి ఇప్పుడు ఉద్యోగుల అవసరం చాలా ఉంది. భారతీయులతో ఆ లోటు తీర్చాలని అమెరికా భావిస్తోంది. వారు అక్కడ చేసే ఉద్యోగంతో సంబంధం లేకుండా కష్టపడి అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తున్నందున భారతీయులే అమెరికాకు ఉత్తమ ఎంపికగా మారుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.