Begin typing your search above and press return to search.
కరోనా: చైనాపై మరోసారి మండిపడ్డ అమెరికా
By: Tupaki Desk | 22 July 2020 8:30 AM GMTప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ దుస్థితికి చైనానే కారణమని అమెరికా మరోసారి ఆరోపించింది. ఈ వైరస్ నివారణకు ఇప్పటికైనా ప్రపంచదేశాలతో కలిసి చైనా రావాలని హితవు పలికింది.
తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తో సమావేశమయ్యారు. చైనా పాటిస్తున్న విధానాలను పాంపియో దృష్టికి తీసుకొచ్చారు. బ్రిటన్ అప్పగించిన హాంకాంగ్ విషయంలో ఆ దేశం అనుసరిస్తున్న వైఖరి.. మైనార్టీలైన ఉవిగర్ ముస్లింల పట్ల వేధింపులు.. కరోనా వైరస్ విషయంలో తన ప్రయోజనాల కోసం దీన్ని వినియోగించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను పాంపియో ఏకరువు పెట్టారు.
ఇక చైనా పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాటిస్తున్న కఠిన వైఖరిని బ్రిటన్ విదేశాంగ మంత్రి డొమినిక్ రాబ్ వద్ద ప్రస్తావించారు. అసలు ఈ విపత్తును మొదట్లోనే నివారించే అవకాశాలున్నా చైనా దాచిపెట్టి ప్రపంచాన్ని మోసం చేసిందని పాంపియో ఆరోపించారు. చైనా అంతర్జాతీయ ప్రమాణ వ్యవస్థకు కట్టుబడి ఉండాలని ఆయన ఆంకాంక్షించారు.