Begin typing your search above and press return to search.

శత్రు యుద్ధ విమానాలపై అమెరికా సరికొత్త అస్త్రం

By:  Tupaki Desk   |   14 Aug 2020 11:30 PM GMT
శత్రు యుద్ధ విమానాలపై అమెరికా సరికొత్త అస్త్రం
X
ప్రపంచంలోనే అగ్రరాజ్యం అమెరికా సరికొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకొంటూ రక్షణ పరంగా మరింత పటిష్టం అవుతోంది. బాంబులు, అణ్వస్త్రాలతో దూసుకొచ్చే శత్రు విమానాలను అంతం చేసే ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్ ను అమెరికా తయారు చేస్తోంది. దీన్నే ‘క్వాంటమ్ కంప్యూటర్ ’గా అభివర్ణిస్తున్నారు.

ఇప్పుడు అమెరికా తన ఆత్మరక్షణ కోసం యుద్ధవిమానాలు, క్షిపణులు ప్రతిగా ప్రయోగించడం కంటే కొత్త అస్త్రాన్ని కనిపెట్టింది. అదే ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్. చల్లని అణువులతో కూడిన క్వాంటం కంప్యూటర్ ను శత్రు విమానాలపై ప్రయోగిస్తోంది.

రాడార్ లకు కూడా చిక్కకుండా సులువుగా గుర్తించగలిగేలా క్వాంటమ్ కంప్యూటర్ లోపల ఉండే అణువులు సంక్లిష్టమైన సమస్యలను క్షణాల్లో పరిష్కరించగలవు.

కోల్డ్ క్వాంటా సంస్థ ఇలాంటి సాధనాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ నిర్మాణానికి ఆధారమైన క్యూబిట్స్ గా పనిచేసే అణువులను అవసరానికి సరిపడా సమీకరించడం ద్వారా లక్ష్యానికి గురిపెడుతుంది. ఇది జరగాలంటే అణువులు అత్యంత శీతలంగా ఉండాలి. అందుకే ఇది ప్రపంచంలోనే అతి చల్లని కంప్యూటర్ గా అవుతుంది.