Begin typing your search above and press return to search.

ట్రంప్ కోసం అన్ని కోట్లు అవసరమా..భారత్ కి అమెరికా మీడియా సూటి ప్రశ్న!

By:  Tupaki Desk   |   20 Feb 2020 12:00 PM GMT
ట్రంప్ కోసం అన్ని కోట్లు అవసరమా..భారత్ కి అమెరికా మీడియా సూటి ప్రశ్న!
X
అగ్రరాజ్యం అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఈ నెల 24 , 25 వ తేదీలలో భారత్ పర్యటనకి రానున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా భారత్ పర్యటనకి రావడం ఇదే తొలిసారి కావడంతో భారత ప్రభుత్వం ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి , ట్రంప్ పర్యటన విజయవంతం చేయడానికి ..ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రంప్ పర్యటించే రోడ్లు, ప్రాంతాలన్నీ ప్రస్తుతం అద్దంలా మెరిసిపోతున్నాయి. అయన వెళ్లే రోడ్లు సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రంప్ హైప్రొఫైల్ కు తగినట్టుగా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అహ్మదాబాద్ లోని మురికివాడలు కనిపించకుండా, వాటికీ అడ్డుగా గోడలని కట్టి చాలా అందంగా తీర్చుదిద్దుతున్నారు. అలాగే రోడ్లపై ఉండే పాన్ షాపులను మూసివేస్తున్నారు.

అయితే , ఇదంతా ట్రంప్ కోసమేనా? అని అంటోంది అమెరికా మీడియా.. ట్రంప్ పర్యటన కోసం ఇంతా హడావుడి అవసరమా? అన్నట్టు ఇండియా పై సెటైర్లు వేస్తుంది. అయితే , ట్రంప్ భారత్ పర్యటనకి ముందే .. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితా నుంచి భారత్‌ను తొలగించాలని నిర్ణయించారు. దీని అర్థం.. తలసరి ఆదాయం సుమారుగా 2వేల డాలర్లు మాత్రమే ఉన్నప్పటికీ, 12,375 డాలర్ల మార్కు కంటే తక్కువగా ఉన్నా కూడా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించాలని అధ్యక్షుడు ట్రంప్ కోరుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన భారతదేశం ఆర్థికంగా స్థిరంగా లేదనే చెప్పాలి .

ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ బాగాలేదు. రోజురోజుకి మరింతగా క్షిణిస్తుంది. కానీ , ఈ సమయంలో ట్రంప్ పర్యటనకి వస్తుండటం తో ఆయనకి ఈ విషయం తెలియకుండా రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకే ట్రంప్ పర్యటించే గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయో అమెరికా మీడియా ఏకిపారేస్తుంది. డొనాల్డ్ ట్రంప్ కు గోడలంటే బాగా ఇష్టమా? అంటే ఒక రకంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే.. అమెరికా-మెక్సికో సరిహద్దులో ఒక పెద్ద గోడను నిర్మించాలని ట్రంప్ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. ఇప్పడు అలాంటి పెద్దగోడను తలపించేలా భారత్ పర్యటనలో ట్రంప్ ను ఆకట్టుకునేలా ఉంది. అందుకే.. ట్రంప్ అహ్మదాబాద్ లో అడుగుపెట్టడానికి ముందే ఏడు అడుగుల 400 మీటర్ల పొడవైన గోడను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. స్టేడియానికి వెళ్లే మార్గంలో మురికి వాడలు ఉన్నాయి. అవి కనిపించకుండా ఉండేందుకు ఈ గోడను నిర్మించారా ఏంటి? అన్నట్టుగా అమెరికా మీడియా అంటోంది. ఈ గోడల నిర్మాణానికి సుమారు రూ. 100 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. మురికివాడలను దాచడానికి ప్రయత్నించే బదులు వాటిని అభివృద్ధి చేయడానికి అదే ఖర్చు చేస్తే బాగుండేదని యూఎస్ మీడియా భారత్ కి తెలిపింది.

అలాగే, ట్రంప్ పర్యటనకు ముందుగానే.. కనీసం 60 అంతర్జాతీయ - దేశీయ విమానాలను రీ షెడ్యూల్ చేశారు అధికారులు.. అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి వచ్చే ప్రముఖ వ్యక్తుల కోసం 10 బేసి విమానాలు మాత్రమే ఉన్నాయి. ఇతర విమానాలు సూరత్ లేదా బరోడాకు మళ్లించారు. గోడ నిర్మించడానికి డబ్బు సరిపోకపోతే - ట్రంప్ పర్యటించే 22 కిలోమీటర్ల రహదారి కోసం స్థానిక అధికార యంత్రాంగం రూ .30 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ట్రంప్ వెళ్లే ఈ మార్గంలో ప్రతిచోట 28 దశలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం - లక్షలకు పైగా చెట్లు - ఫ్లవర్ బెడ్స్ - స్టేడియం దగ్గరకు ప్రజలను తరలించేందుకు 2,200 కి పైగా బస్సులను పంపడం వంటివి విషయాలు ఉన్నాయి. దీనిపై యూఎస్ మీడియా కొంచెం వ్యంగ్యంగా స్పందిస్తుంది.