Begin typing your search above and press return to search.
కరోనా నివారణకు..భారత్ సహాయం కోరిన అమెరికా
By: Tupaki Desk | 5 April 2020 5:50 AM GMTఅగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితులు దారుణంగా మారింది. కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుండడంతో దేశం గజగజ వణికిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో పాటు మృత్యువాత చెందుతున్నారు. దీంతో కరోనా వైరస్ నుంచి బయట పడేందుకు అమెరికా అన్ని చర్యలు తీసుకుంటోంది. అయినా కరోనా కట్టడి కావడం లేదు. ఈ మేరకు భారతదేశంలో పాటిస్తున్న చర్యలను పరిశీలించింది. భారతదేశంలో కరోనా నివారణ - కట్టడికి తీసుకుంటున్న చర్యలను ప్రశంసించింది. ఇప్పటివరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మూడు లక్షలను దాటగా.. మృతులు 8 వేలకు చేరాయి. కరోనా కట్టడికి ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో అమెరికా ఇప్పుడు అతలాకుతలమవుతోంది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా వైరస్ కట్టడికి.. ఆ వైరస్ ను తగ్గుముఖం పట్టించేందుకు అమెరికా భారతదేశ సహాయం కోరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక విజ్ఙప్తి చేశారు. మలేరియా సోకిన వారికి అందించే వైద్య చికిత్సలో వినియోగించే హైడ్రోక్సి క్లొరోక్విన్ ను వెంటనే సరఫరా చేయాలని డొనాల్డ్ ట్రంప్ కోరారు. తమ దేశానికి ఆ మందు పంపాలని ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఙప్తి చేశారు. హైడ్రోక్సి క్లొరోక్విన్ డ్రగ్ ను కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్య చికిత్సలో వినియోగిస్తున్నారు. దీంతో ఆ దేశంలో ఆ మందు కొరత ఉండడంతో భారత్‌ను ట్రంప్ కోరారు.
ప్రస్తుతం యాంటీ మలేరియన్ డ్రగ్ ఎగుమతులను భారతదేశం నిలిపివేయడంతో ఆ మందు కొరత తీవ్రంగా ఉంది. ఈ డ్రగ్ తీవ్ర కొరత ఉండడంతో అందుబాటులో లేదు. దీంతో కరోనా నివారణకు అమెరికా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో ఆ నిషేధం వదిలేసి వెంటనే ఆ మందు సరఫరా చేయాలని ట్రంప్ కోరారు. ఈ క్రమంలో కరోనా వైరస్ పై భారత్ అద్భుతమైన పోరాటాన్ని కొనసాగిస్తోందని డొనల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 130 కోట్ల మంది భారతీయులను ఒక్క పిలుపుతో నరేంద్ర మోదీ ఏకతాటిపైకి తీసుకొచ్చారని భేష్ అనిపించారు. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు చూపిన సంయమనం అద్వితీయమని పేర్కొన్నారు. యాంటీ మలేరియన్ డ్రగ్ హైడ్రొక్సిక్లొరోక్విన్ అవసరాలు భారత్ కు కూడా ఉంటుందని - అయినప్పటికీ.. తమకు ఆ మందుల అవసరాలు ఉన్నాయని.. వెంటనే పంపించాలని కోరారు.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,11,357 నమోదయ్యాయి. మరణాల సంఖ్య 8 వేలకు చేరాయి.