Begin typing your search above and press return to search.

డాన్ పై అమెరికా గన్..?

By:  Tupaki Desk   |   4 Dec 2015 11:47 AM GMT
డాన్ పై అమెరికా గన్..?
X
ముంబయి వరుస బాంబు పేలుళ్ల కారకుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కౌంట్ మొదలైనట్లుగా కనిపిస్తోంది. ఆయన్ను భారత్ రప్పించేందుకు ఇండియా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాకిస్థాన్ నుంచి సహకారం అంతంత మాత్రంగా ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. అయితే.. ఉగ్రవాదంపై పోరులో భాగంగా అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు దావూద్ పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు పాక్ తో ఫ్రెండ్షిప్ కారణంగా దావూద్ ను చూసీచూడనట్లు వదిలేసిన ఐసిస్ వంటివాటికి దావూద్ సహాయం అందుతోందన్న అనుమానంతో ఈ డాన్ పై గురిపెడుతోంది.

అందులో భాగంగానే డాన్ ముఖ్య అనుచరుడు.. ఆయన ఆర్థిక వ్యవహారాల సలహాదారు అల్తాఫ్ ఖనానీని అమెరికా అరెస్టు చేసింది. సెప్టెంబరు 11నే ఆయన్ను పట్టుకున్నారని... విచారిస్తున్నారని సమాచారం. ఖనానీ దావూద్ కు ఆర్థిక సలహాదారే కాకుండా ఫైనాన్షియర్ కూడా అని... ఆయన లష్కరే తోయిబాకు కూడా నిధులు సమకూరుస్తున్నాడని తేల్చారు. బ్రిటన్ , కెనడా, ఆస్ర్టేలియా, అమెరికా, దుబాయి వంటి దేశాల నుంచి నగదను పాకిస్థాన్ ను అక్రమ మార్గాల్లో పంపేందుకు ఖనానీ ఆధ్వర్యంలో ఒక సంస్థ పనిచేస్తోంది. పేరుకు ఇది ఖనానీది అయినా దావూద్ దేనని అమెరికా అంటోంది. ఖనానీ అరెస్టుతో దావూద్ వ్యాపారం పడిపోతుందని అంటున్నారు. ఖనాని అరెస్టు దావూద్ ను అమెరికా టార్గెట్ చేసిందనడానికి నిదర్శనమని... ఆయన్ను ఇక అమెరికా వెంటాడుతుందని అంటున్నారు.