Begin typing your search above and press return to search.
డోక్లాంలో చైనా దూకుడుకు అమెరికా షాకిచ్చింది
By: Tupaki Desk | 11 Oct 2017 4:35 PM GMTమనదేశ సరిహద్దుల్లో ఉన్న డోక్లాంలో...అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి...చట్టాలను పక్కనపెట్టి కవ్వింపు చర్యలకు పాల్పడటం ద్వారా పొరుగు ఉన్న చైనా దాదాపుగా గత ఆరు నెలలుగా ఉద్రిక్త పరిస్థితులకు కారణంగా మారుతున్న సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని భారత్ సూచించినప్పటికీ చైనా పెడచెవిన పెడుతోంది. ఈ నేపథ్యంలో చైనాకు అగ్రరాజ్యం అమెరికా ఇదే తరహా షాక్ ను ఇచ్చింది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర దీవులకు సమీపంలో అమెరికా యుద్ధ నౌక తిరిగింది. యూఎస్ నేవీకి చెందిన యుద్ధ నౌక చాఫీ మంగళవారం చైనా జలాల్లోకి వచ్చింది. అయితే దీంతో సహజంగానే చైనా కంగారు పడింది. అమెరికా నేవీ నౌక తిరగడాన్ని చైనా తీవ్రంగా నిరసించింది.
అమెరికా యుద్ధనౌక తమ జలాల్లోకి రావడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ యింగ్ అసహనం వ్యక్తం చేశారు. తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని అమెరికాను కోరారు. అమెరికా నౌక వచ్చిన వెంటనే స్పందించిన చైనా.. మిలిటరీ నౌకలు - ఎయిర్ క్రాఫ్ట్ లను అక్కడికి పంపించి అమెరికా నౌకను వెంటనే వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించినట్లు ఆయన అన్నారు. దీనిపై అమెరికాకు తమ నిరసనను తెలియజేసినట్లు ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ పేరుతో అమెరికా నౌకలు ఇలా చైనా జలాల్లోకి వెళ్లడం ఇది నాలుగోసారి అవుతుంది. అయితే అంతర్జాతీయ చట్టాలకు లోబడే తమ నౌక అక్కడికి వెళ్లినట్లు అమెరికా రక్షణ శాఖ చెబుతోంది.
కాగా, ఏడాదికి 5 లక్షల కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగే ఈ సముద్రంపై పూర్తి హక్కులు తనవే అని చైనా వాదిస్తోంది. గతంలో అంతర్జాతీయ న్యాయస్థానం చైనాకు వ్యతిరేకంగా తీర్పు చెప్పినా ఆ దేశం వెనుకడుగు వేయలేదు. పైగా ఇది తమ పొరుగు దేశాలతో ఉన్న సమస్య అని - ఇందులో ఇతర దేశాలు తలదూర్చితే బాగుండదని కూడా చైనా హెచ్చరిస్తోంది. బ్రూనై - మలేషియా - ఇండోనేషియా ఫిలిఫ్పెన్స్ - వియత్నాంలకు కలిపి అధికారాలు ఉన్నప్పటికీ...దక్షిణ చైనా సముద్రం తమదే అంటూ చైనా వాదిస్తోంది. కొద్దికాలం క్రితం దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవిని నిర్మించడం - అక్కడ మిలిటరీ బేస్ లను ఏర్పాటు చేసింది. దీనిపై గతంలోనే అమెరికా - ఆస్ట్రేలియా - జపాన్ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ చర్యలతో మొత్తం సముద్రంపై చైనా హక్కులు సంపాదించే ప్రమాదం ఉన్నట్లు ఆ దేశాలు ఆందోళన వ్యక్తంచేశాయి.
మరోవైపు కొద్దికాలం క్రితం చైనా దిమ్మతిరిగేలా...అక్కడ భారతదేశం మిస్సైల్ ను మోహరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దౌత్యపరమైన విషయాల్లో వియత్నాంతో మన దేశానికి సుహృద్భావ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఓడలపై నుంచి ప్రయోగించే అత్యంత శక్తివంతమైన మిస్సైల్స్ బ్రహ్మెస్ ను మన దేశం నుంచి కొనుగోలు చేయాలని వియత్నం ప్రయత్నిస్తోంది. ఈ డీల్ కు ఇటీవలే భారత్ ఓకే చేసింది. దీంతో మన దగ్గర కొనుగోలు చేసిన బ్రహ్మోస్ ను తన పరిధిలో దక్షిణ చైనా సముద్రంలో వియత్నం మోహరించేందుకు రెడీ అయింది. ఇటీవలి కాలంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ అమ్మకం జరిగి ఉండవచ్చని పలువురు అంచనా వేశారు.