Begin typing your search above and press return to search.
హెచ్1బీలో భారతీయులకే పెద్దపీటః అమెరికా
By: Tupaki Desk | 16 Sep 2017 12:27 PM GMTభారతీయ టెక్ నిపుణులకు మరో శుభవార్త. అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకునే వారికి హెచ్1బీ వీసా విషయంలో ఇప్పటివరకు కొనసాగుతున్న అస్పష్టతపై అగ్రరాజ్యం మరింత క్లారిటీ ఇచ్చింది. హెచ్1 వీసాలపై ఆంక్షలేవీ లేవని, భారత్ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. హెచ్1బీ వీసాలను ఆంక్షలను పునఃసమీక్షించాలని భారత్ కోరిన నేపథ్యంలో.. వీసాలపై ఆంక్షలు అమల్లోలేవని ఆయన తెలిపారు.
గడిచిన తొమ్మిది మాసాల్లో 70శాతం హెచ్1బీ వీసాలను భారతీయులకు జారీ చేశామని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ అధికారి చెప్పినట్లు అమెరికా మీడియా తెలిపింది. గత ఏడాది భారతీయులకు రికార్డుస్థాయిలో 12లక్షల వీసాలను అమెరికా ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. ‘హెచ్1బీ వీసా అనుమతులను, నిబంధనలను పునఃసమీక్షించాలని మాత్రమే అధ్యక్షుడు ట్రంప్ కోరారు. కానీ, ఆంక్షలు విధించారంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి అలాంటి ఆదేశాలేవీ వెలువడలేదు. హెచ్1బీకి సంబంధించి గత నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కానీ వాటిపై సమీక్ష మాత్రం పెండింగ్‌లో ఉన్నది’ అని ఆ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదిలాఉండగా....భారతీయులకు వీసా నిబంధనలను సరళతరం చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్ణయం తీసుకోవడం భారత్-యూఏఈ సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని ఆ దేశ రాయబారి అభిప్రాయపడ్డారు. బ్రిటన్, యురోపియన్ యూనియన్ నుంచి నివాస వీసా కలిగిన భారతీయులకు విమానాశ్రయంలో అప్పటికప్పుడు వీసా అందించేందుకు తమ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని భారత్‌లో యూఏఈ రాయబారి అహ్మద్ అల్బన్నా వెల్లడించారు. భారత్-యుఏఈ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు ఈ వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు.