Begin typing your search above and press return to search.

చైనాను లాగి భారత్ ను రెచ్చగొడుతున్న అమెరికా..

By:  Tupaki Desk   |   1 April 2022 8:30 AM GMT
చైనాను లాగి భారత్ ను రెచ్చగొడుతున్న అమెరికా..
X
రష్యా, ఉక్రెయిన్ల యుద్ధ వ్యవహారంలో భారత్ తటస్థ వైఖరి అలవంభించిన విషయం తెలిసిందే. అయితే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా జరిగిన ఓటమి ప్రక్రియలో భారత్ దూరంగా ఉంది. దీంతో పరోక్షంగా రష్యాకు మద్దతు ఇచ్చినట్లయింది. దీంతో పశ్చిమదేశాలు భారత్ పై గుర్రుగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా దేశం భారత్ పై తన అక్కసును వెళ్లగక్కుతోంది. రష్యాకు భారత్ సాయం చేసిన విధంగా ఆ దేశం మళ్లీ సాయం చేయలేదని అంటోంది. ఇందులో భాగంగా అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనాను మధ్యలో లాగుతున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే..?

భారత్, చైనాల మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట గాల్వానా లోయలో జరిగిన ఘటనతో ఈ వివాదం మరింత తీవ్రమైంది. దీంతో చైనాకు వ్యతిరేకంగా భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. చైనా వస్తువులను బ్యాన్ చేయాలని ఇదివరకే పిలుపునిచ్చింది.

సాంకేతికంగా కూడా చైనాను దెబ్బకొట్టేలా ప్లాన్ వేసింది. అయితే ఓ వైపు చర్చలు అంటూనే మరోవైపు వాస్తవాధీన రేఖ వెంబడి నిర్మాణాలు చేస్తోంది. అయితే ఇటీవల చైనా విదేశాంగ మంత్రి భారత్లో ఆకస్మికంగా పర్యటించారు. భారత్తో సత్సంబంధాల విషయంలో చర్చలు రావాలని కోరారు. అయితే ఎల్వోసి వివాదం సద్దుమణిగిన తరువాతే మిగతా విషయాలపై చర్చలు ఉంటాయని భారత్ రిప్లై ఇచ్చింది.

ఈ క్రమంలో అమెరికా డిప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'భారత్ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఉల్లంఘనకు పాల్పడినా రష్యా భారత్ కు మద్దతు నిలవదు. చైనా, రష్యాలు ఎప్పుడూ సహకరించుకుంటూనే ఉంటాయి. ఆ దేశాల మధ్య ఉన్న బంధం విడదీయరానిది. అలాంటప్పుడు చైనాను కాదని భారత్ కు ఎందుకు సాయం చేస్తుంది.. ?' అని అన్నారు. భారత్ విదేశాంగ కార్యదర్శి హర్షవర్దన్ ప్రింగ్లాతో సహా భారతీయ సంభాషనకర్తలతో సమావేశం జరిగిన తరువాత దిలీప్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో కీలక పాత్ర పోషించిన యూఎస్ డిప్యూటీ ఎన్ఎస్ఏ.. ఉక్రెయిన్ పై దాడిని రష్యాను విమర్శించకపోవడంపై పాశ్చాత్య శక్తులలో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్యూటీ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ దిలీప్ సింగ్ భారత్ లో పర్యటించారు.

ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డాలర్ ఆర్థిక వ్యవస్థను అణగదొక్కడానికి.. రూబుల్ కు మద్దతు ఇవ్వడానికి మేము ఇష్టపడమని అన్నారు. ఇటీవల భారత్ ఇంధన దిగుమతిని రష్యా నుంచి చేసుకోవడానికి రెడీ కావడంపై అమెరికా ఆంక్షలను ఉల్లంఘించడమేనని ఆయన అన్నారు. అయితే భారత్ తన అవసరాల కోసం చమురును తక్కువ ధరకు కొనుగోలు చేయడంలో తప్పేముంది..? ఉక్రెయిన్ పై యుద్ధం ఆపాలని రష్యాను కోరుతున్నాము కదా.. అని భారత్ తెలిపింది.