Begin typing your search above and press return to search.

ప్లాస్మా థెరపీని ఆపేసిన అమెరికా ..ఏంటంటే !

By:  Tupaki Desk   |   22 Aug 2020 2:30 AM GMT
ప్లాస్మా థెరపీని ఆపేసిన అమెరికా ..ఏంటంటే !
X
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి భారిన పడి బయటపడలేక కొట్టుమిట్టాడుతోంది. చైనాలో వెలుగు చూసిన ఈ మహమ్మారి, ఆ తరువాత ప్రపంచం మొతం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం వ్యాక్సిన్ కోసం ఎన్నో దేశాలు శ్రమిస్తున్నాయి. కరోనాకి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. ప్రస్తుతం ఉన్న మందులతో చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్లాస్మా థెరపీ ద్వారా కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా భాదితులకు ప్లాస్మా థెరపీ ఓ అద్భుత ఔషధం. అయితే , తాజాగా ప్లాస్మా థెరపీ అనుమతులను అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిలిపివేసింది. ఈ చికిత్స ద్వారా కోలుకున్న పేషెంట్ల వివరాలు, సాధిస్తున్న సానుకూల ఫలితాల గురించి వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ప్లాస్మా థెరపీ ద్వారా ఎంత మంది కోలుకున్నారు, ఏ మేరకు సత్ఫలితాలు లభించాయన్న వివరాలపై స్పష్టత లేదు. అందుకే ప్రస్తుతానికి ప్లాస్మా థెరపికి అనుమతులు నిలిపివేస్తున్నాం. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో అనుమతులు ఇస్తాం.’ అని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ క్లినికల్‌ డైరెక్టర్‌ హెచ్‌ క్లిఫార్డ్‌ లేన్ తెలిపారు. కాగా కరోనాకు విరుగుడు టీకా అందుబాటులోని రాని నేపథ్యంలో భారత్‌ వంటి దేశాల్లో ప్లాస్మా థెరపీ ద్వారా మహమ్మారిని జయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాపించిన తొలినాళ్లలో పలు సూచనలు చేసిన భారత వైద్య పరిశోధనా మండలి .. ఏప్రిల్‌ నుంచి ప్లాస్మా చికిత్స క్లినికల్‌ ట్రయల్స్‌ అధ్యయనం నిర్వహిస్తోంది.

ఈ క్రమంలో జూలై 2న ఢిల్లీలోని లివర్‌ అండ్‌ బిలియరి సైన్సెస్ ‌లో ప్లాస్మా బ్యాంకును ఏర్పాటు చేసి.. కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాను సేకరించి కోవిడ్‌ పేషెంట్లకు ఎక్కిస్తున్నారు. ప్లాస్మా థెరపీ ద్వారా కరోనా రోగులు కోలుకుంటున్నారడానికి సరైన ఆధారాలు లేవు. ఏప్రిల్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభమైనా, ఆగష్టు వరకు కూడా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం, గణాంకాలు బయటకు రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎథిక్స్‌ ఎడిటర్‌ అమర్‌ జేసాని తెలిపారు.