Begin typing your search above and press return to search.

భార‌త్‌ పై మా‌ర‌ని అమెరికా తీరు: ట‌్విట‌ర్‌ లో అన్ని అకౌంట్లు అన్ ఫాలో

By:  Tupaki Desk   |   29 April 2020 2:36 PM GMT
భార‌త్‌ పై మా‌ర‌ని అమెరికా తీరు: ట‌్విట‌ర్‌ లో అన్ని అకౌంట్లు అన్ ఫాలో
X
అగ్ర‌రాజ్యంగా త‌న ఉనికిని చాటుకోవ‌డానికి అమెరికా నిరంత‌రం త‌హ‌త‌హ‌లాడుతోంది. ఎక్క‌డా త‌న ప్ర‌తిష్ట త‌గ్గుతుంద‌ని భావించిన వెంట‌నే దిద్దుబాటు చ‌ర్య‌లు చేప‌డుతుంది. అది ఎలాంటి స‌మ‌యంలోనైనా.. దానికోసం ఏం చేయాలో అన్ని చేస్తుంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు త‌న రాజ్యానికి భార‌త్ కొంత ఎస‌రు పెడుతుంద‌ని అమెరికా భావించింది. దీంతో భార‌త‌దేశంపై వివ‌క్ష ప్రారంభించింది. మొన్న క‌రోనా నివార‌ణ‌కు భార‌త్‌ చేసిన స‌హాయాన్ని మ‌ర‌చిపోయి మ‌రీ అమెరికా పాత వైఖ‌రే అనుస‌రించింది. దీనిలో భాగంగా భార‌త‌దేశానికి సంబంధించిన అకౌంట్ల‌ను ట్విట‌ర్‌ లో అన్‌ ఫాలో చేసింది.

భార‌త‌దేశంలో ప‌ర్య‌టించిన స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొన‌ల్డ్ ట్రంప్ మ‌న‌దేశంపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అనంత‌రం అమెరికాకు వెళ్లిన వెంట‌నే ట్రంప్ వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ విజృంభించింది. ఈ స‌మ‌యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ త‌దిత‌ర మందుల కొర‌త తీవ్రంగా ఉండ‌డంతో భార‌త్‌ ను స‌హాయం అడిగాడు. అయితే భార‌త్ నిరాక‌రించ‌డంతో ట్రంప్‌ కు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. స‌హాయం చేయ‌క‌పోతే ప్ర‌తికారం తీర్చుకుంటామ‌ని హెచ్చ‌రించాడు. ఈ విధంగా అమెరికా ఔనంటే కాళ్లు.. లేదంటే పీక ప‌ట్టుకునేలా వ్య‌వ‌హారం ఉంది. అయితే కొన్ని రోజులకు భార‌త్‌లో నిల్వ‌ల‌ను చూసుకున్న త‌ర్వాత స‌రిప‌డా ఉండ‌డంతో అమెరికాకు ఎగుమ‌తి చేసేందుకు భార‌త్ అంగీక‌రించింది. దీంతో వెంట‌నే ట్రంప్ ధోర‌ణిలో మార్పు

ఏప్రిల్ 8 వ తేదీన భార‌త్ నుంచి హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మందును అమెరికాకు ఎగుమతి చేయ‌గా ఏప్రిల్ 10వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొన‌ల్డ్ ట్రంప్ భార‌త్‌ కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ సంద‌ర్భంగా వైట్ హౌస్ ట్విట‌ర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా - ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంఓ), -నరేంద్ర మోదీకి సంబంధించిన‌ ట్విట్టర్ అకౌంట్ల‌ను ఫాలో కావడం మొదలుపెట్టింది. అయితే ప్ర‌స్తుతం భార‌త్‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరుప్ర‌ఖ్యాతులు రావ‌డంతో ఈర్ష్య మొద‌లైంది. ప‌ర‌ప‌తి భార‌త్‌కు ద‌క్క‌డంపై అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతూ అక‌స్మాత్తుగా భార‌త్‌ కు సంబంధించిన అన్ని ట్విట‌ర్ అకౌంట్ల‌ను వైట్‌ హౌస్ అన్‌ ఫాలో చేసింది. భార‌త ట్విట‌ర్ అకౌంట్లన‌న్నింటిని బ‌హిష్క‌రించిన‌ట్టు అమెరికా చ‌ర్య ఉంది. రాష్ట్ర‌ప‌తి - ప్ర‌ధాన‌మంత్రి - న‌రేంద్ర‌మోదీ ట్విట‌ర్ అకౌంట్ల‌తో పాటు అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అకౌంట్‌ ను - ఇండియాలో అమెరికన్ ఎంబసీ అకౌంట్‌ ను అన్ ఫాలో చేయ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.