Begin typing your search above and press return to search.
వారి ఖర్చులని అమెరికా భరించదు : ట్రంప్ !
By: Tupaki Desk | 30 March 2020 5:30 PM GMTప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెన్ ..వీరిద్దరి గురించి అందరికి తెలిసిందే. బ్రిటీష్ రాజ కుటుంబానికి శాశ్వతంగా వీడ్కోలు చెప్పి బ్రిటీష్ కొలంబియా ప్రాంతంలోని కెనడాలో ఓ విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసి అందులో తమ కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. వారు కెనడాకు వచ్చి మకాం పెట్టినప్పటి నుంచి వారి భద్రతకయ్యే ఖర్చును ఎవరి భరిస్తారన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ ఖర్చులను కెనడా ప్రభుత్వం భరిస్తుందని వార్తలు తొలుత వెలువడగా, అందుకు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తాము చెల్లిస్తున్న పన్నులతో నడుస్తున్న ప్రభుత్వ ఖజానా నుంచి ఎలా సొమ్మును వృధా చేస్తారంటూ పలు వర్గాల ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. కుటుంబం నుంచి వైదొలిగిన నాటి నుంచి వారి భద్రతకు అయ్యే ఖర్చులను చెల్లించడం మానేస్తామని గత నెలలో కెనడియన్ అధికారులు వెల్లడించారు. అయితే , ఇప్పుడు వారు కెనడా నుంచి యుఎస్ కు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ప్రస్తుతం కెనడాలో నివశిస్తున్న ప్రిన్స్‌హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు అమెరికాకు వస్తే వారి భద్రతా ఖర్చులను తమ ప్రభుత్వం చెల్లించే ప్రసక్తేలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. 'నేను.. యునైటెడ్ కింగ్ డమ్, ఆదేశ రాణికి మంచి స్నేహితుడిని. వారిపై నాకు ఎంతో అభిమానం ఉంది. రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చిన హ్యారీ, మేఘన్.. కెనడాలో శాశ్వతంగా నివసిస్తారని తెలిసింది. ఒకవేళ హ్యారీ దంపతులు యూఎస్ వస్తే వారి భద్రతా ఖర్చులు మా ప్రభుత్వం చెల్లించదు. వారే స్వయంగా చెల్లించాలి' అని ట్రంప్ పేర్కొన్నారు.