Begin typing your search above and press return to search.

అమెరికా విమాన టికెట్ ధర 3 రెట్లు పెంపు!

By:  Tupaki Desk   |   27 April 2021 12:30 AM GMT
అమెరికా విమాన టికెట్ ధర 3 రెట్లు పెంపు!
X
సెకండ్ వేవ్ కారణంగా భారతదేశం ఇప్పుడు కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో దేశంలోకి రావడానికి.. లేదా దేశం నుంచి విదేశాలకు వెళ్లడం ఈ టైంలో సాహసంగా మారింది. భారత్ లోని కరోనా తీవ్రత అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే యూకే,, జర్మనీ, యుఏఈ, న్యూజిలాండ్, కెనడా మరియు ఇతర దేశాలు భారత ప్రయాణికులు తమ దేశంలోకి రాకుండా నిషేధం విధించాయి

తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఆ దేశాల బాటలో నడిచింది. అమెరికా ఎటువంటి నిషేధాన్ని విధించకపోయినా కూడా బిడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం తప్పనిసరి అయితేనే భారత్ కు రాకపోకలు సాగించాలని.. లేదంటే ప్రయాణానికి అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేసింది.

అమెరికా ప్రభుత్వం భారత్ కు వెళ్లొద్దని సూచించడంతో విమాన టిక్కెట్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. భారతదేశంలో పరిస్థితి చేయిజారిపోతుంటే అమెరికా ఖచ్చితంగా విమానాలను నిషేధిస్తుందని చాలా మంది ఇండో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే ముఖ్యంగా టెక్కీలు తమ టికెట్లను బుక్ చేసుకునే హడావిడిలో ఉన్నారు. భారత్ కు వచ్చే లేదా అమెరికాకు వెళ్లే వారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల డిమాండ్ ఏర్పడింది. విమాన టిక్కెట్ల ధరలు మూడు రెట్లు పెరిగాయి.

సాధారణంగా అమెరికాు ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు 50,000 రూపాయలు.. ఇప్పుడు అది రూ .1.5 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందినప్పటి నుండి అమెరికాకు విమానాలు చాలా పరిమితం చేయబడ్డాయి. అది కూడా రెండు దేశాలలోని విమానయాన అధికారుల నుండి ముందస్తు ఆమోదంతోనే నడుస్తున్నాయి.

కాబట్టి విమానయాన సంస్థలు టికెట్లకు డిమాండ్ రావడంతో అమాంతం రేటు పెంచేశాయి. ఈ రష్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. కాని ఎవరూ డిస్కౌంట్ ఇవ్వడం లేదు. భారీ ధరతో టికెట్లు అమ్ముడవుతున్నాయి.