Begin typing your search above and press return to search.

మంటల్లో ప్ర‌యాణికుల విమానం

By:  Tupaki Desk   |   29 Oct 2016 3:45 PM GMT
మంటల్లో ప్ర‌యాణికుల విమానం
X
ఆ విమానంలో మొత్తం 170 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. కొద్ది సేప‌ట్లో టేకాఫ్ తీసుకోనుంది. ప్ర‌యాణికులంతా విమానం దిగి త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకునేందుకు రెడీ అవుతున్నారు. అయితే అంత‌లోనే విమానంలో ఒక్క‌సారిగా మంట‌లు అలుముకున్నాయి. ప్ర‌యాణికుల కేక‌లు, ఏడుపులు ఒక్క క్ష‌ణం విమానంలో ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి అర్థం కాలేదు. ఇంజిన్‌లో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌తో కేవ‌లం 10-15 నిమిషాల్లోనే విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 20 మంది గాయాల‌పాలవ్వ‌గా, వీరిలో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

చికాగోలోని ఓహేర్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎయిర్‌పోర్టులో రాత్రి 2.45 నిమిషాల‌కు అమెరిక‌న్ ఎయిర్‌లెన్స్‌కు చెందిన 383 విమానం టేకాఫ్ తీసుకునేందుకు రెడీ అవుతోంది. ఇంత‌లోనే ఇంజ‌న్‌లో త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌తో క్ష‌ణాల్లోనే విమానంలో మంట‌లు వ్యాపించాయి. ప్ర‌యాణికులంతా ఎడ‌మ‌వైపున‌కు ప‌డిపోయారు. డోర్లు తెవ‌ర‌మ‌ని ప్ర‌యాణికులు అరుస్తుండ‌గా ప‌రిస్థితి గ‌మ‌నించిన ఎయిర్‌లెన్స్ అధికారులు వెంట‌నే వారిని ఎమ‌ర్జెన్సీ స్లైట్ ద్వారా బ‌య‌ట‌కు పంపించేశారు.

ఎమ‌ర్జెన్సీ స్టైట్స్ ద్వారా విమానంలో నుంచి కిందకు దూకిన ప్ర‌యాణికులు ప్రాణ‌భ‌యంతో కేక‌లు వేస్తూ అక్క‌డి నుంచి దూరంగా పారిపోయారు. ఇవి అక్క‌డే ఉన్న సీసీ కెమేరాల్లో స్ప‌ష్టంగా రికార్డు అయ్యాయి. విమానం మంట‌ల్లో ఎలా చిక్కుకుంది..? ప్ర‌యాణికులు స్టైట్ ద్వారా ఎలా కింద‌కు దూకారన్న విజువ‌ల్స్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ ఘ‌ట‌న‌పై అమెరికా నేష‌న‌ల్ ట్రాన్స్‌పోర్టేష‌న్ సేఫ్టీ బోర్డు విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఈ విమానం 2003లో త‌యారు కాగా....ఆ మోడల్లో అమెరికన్ యంగెస్ట్ ఫ్లైన్ గా పేరొంది.