Begin typing your search above and press return to search.

వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే కరోనా ఖతమట?

By:  Tupaki Desk   |   28 Dec 2021 4:49 AM GMT
వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే కరోనా ఖతమట?
X
ప్రపంచాన్ని మరోసారి ఒమిక్రాన్ పట్టి పీడిస్తుంది. కరోనా వేవ్ నుంచి రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకొని తప్పించుకున్నాం.. మరి ఒమిక్రాన్ నుంచి తప్పించుకోవడమెలా..? బూస్టర్ డోస్ వేసుకోవాలా..? ప్రత్యామ్నాయం ఏం లేదా..? అంటే అమెరికాకు చెందిన ఓ వైద్యుడు సంచలన విషయాలు చెప్పాడు. ‘వారానికి రెండు సార్లు భాగస్వామితో శృంగారంలో పాల్గొనండి.. కరోనా మీ దరికి చేరదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకోవడానికి ఎవరికి నచ్చినట్లు వారు చెబుతున్నారు. కానీ ఈ డాక్టర్ ఆధారాలతో సహా నిరూపించానని బహిరంగంగా చెప్పాడు. దీంతో ఆయన న్యూస్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై ఎవరూ ఖండన తెలపకపోవడంతో నిజంగానే సెక్స్ లో పాల్గొంటే కరోనా నుంచి దూరంగా ఉంటమా..? అనే భావన కలుగుతోంది.

కరోనా మొదటి వేవ్ నుంచి గట్టెక్కడానికి అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి జీవితంలో ఎన్నడూ తినని పదార్థాలను తినాల్సి వచ్చింది. కాషాయం పేరుతో మసాలలన్నీ కలిపి తాగాల్సి వచ్చింది. చికెన్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందనడంతో వారానికి రెండు మూడు సార్లు దానిని తినాల్సి వచ్చింది. కొందరు పసరు వైద్యులు చెప్పిన ఆకులను కూడా కొందరు ఆశ్రయించారు. ఇలా రకరకాల మార్గాల ద్వారా మొదటి వేవ్ నుంచి చాలా మంది ఎలాగోలా బయటపడ్డారు.

అయితే ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. అత్యధిక వేగంతో కేసులు పెరుగుతున్నాయి. యూకేలోనైతే ప్రతీరోజూ లక్షకు పైగానే కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలో ఇప్పటి వరకు 200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నా.. వివిధ పనుల వల్ల కొందరు నిర్లక్ష్యం చేయడం తప్పడం లేదు. దీంతో ఒమిక్రాన్ విస్తరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఫంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ వేయాలని నిర్ణయించింది. దీంతో మిగతా వారికి కూడా మూడో వ్యాక్సిన్ అవసమయ్యే సంకేతాలు కనిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అమెరికాలోని ఆరిజోనాకు చెందిన డాక్టర్ ఫెయిత్ తన టిక్ టాక్ లో చెప్పాడు. ఈయన టిక్ టాక్ యాప్లో యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఖాతాకు ఆరున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇటీవల ఆయన ఈ యాప్ ద్వారా లైవ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ డాక్టర్ ను ఓ ప్రశ్న వేశాడు. భావ ప్రాప్తి వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవనేది నిజమేనా..? అని అడిగాడు. దీంతో ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.

‘అవును వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొంటే శరీరంలో రోగ నిరోధక శక్తి 30 శాతం పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.’ అని చెప్పారు. దీంతో ఆయన సమాధానం వైరల్ అయింది. అయిడే శృంగారం వల్ల శరీరానికి ఎంతో ఉల్లాసంగా ఉంటుందని ఇప్పటికే చాలా మంది వైద్యవేత్తలు చెప్పారు. 2004లో జరిగిన ఓ అధ్యయనంలో సెక్స్ చేయడం వల్ల శరీరంలో ఇమ్యూనోగ్లోబిన్ -ఏ స్థాయిలు పెరుగుతాయని తెలిపింది. ఇది ఒకరకమైన యాంటి బాడీలా పనిచేస్తుందని తెలిపింది. దాంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొంది. వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా శరీరానికి ఎలాంటి యాంటిబాడీస్ వస్తాయో వారానికి రెండు సార్లు సెక్స్ చేస్తే అంతే స్థాయిలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని అంటున్నారు. ప్రస్తుత సమయంలో కరోనాను ఎదుర్కోవడానికి యాంటి బాడీస్ అవసరం. అందువల్ల యాంటీ బాడీస్ కోసం శృంగారంలో పాల్గొనవచ్చని డాక్టర్ ఫెయిత్ తెలిపారు.