Begin typing your search above and press return to search.
సముద్రంలో కూలిన అమెరికా అత్యాధునిక యుద్ధవిమానం.. చైనాకు దొరక్కుండా ఆపసోపాలు
By: Tupaki Desk | 1 Feb 2022 8:30 AM GMTఅమెరికా నావికా దళానికి చెందిన ఒక యుద్ధ విమానం దక్షిణ చైనా సముద్రంలో కూలిపోయింది. చైనా ఆ విమాన శకలాలు సంపాదించక ముందే తాము దానిని చేరుకోవాలని అమెరికా నౌకాదళం కాలంతో పోటీపడుతోంది.
పది కోట్ల డాలర్ల విలువ చేసే ఆ ఎఫ్35సీ విమానం.. యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ యుద్ధనౌక నుంచి టేకాఫ్ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ కూలిపోయిందని అమెరికా నౌకదళం చెప్పింది. ఆ జెట్ విమానం సరికొత్తది.. అత్యంత రహస్య పరికరాలను దానిలో అమర్చారు. ఇప్పుడది అంతర్జాతీయ జలాల్లో కూలిపోవడంతో దానిని ఎవరైనా తీసుకునే వీలు చిక్కింది. ఎవరు ముందు దానిని చేరుకుంటే వారే గెలుస్తారు.. మరి దీని వల్ల లాభం ఏంటంటే? అత్యంత ఖరీదైన , అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఈ యుద్ధ విమానంలోని రహస్యాలన్నీ అమెరికా శత్రువుల చేతికి చిక్కుతాయి.
-ఎలా ఎఫ్35 సీ మునిగింది?
గత సోమవారం సైనిక విన్యాసాల సందర్భంగా విన్నన్ డెక్ కు ఢీకొని ఈ యుద్ధ విమానం కూలిపోయింది. ఆ సమయంలో ఏడుగురు నావికులు గాయపడ్డారు. ఇప్పుడది సముద్రగర్భంలో పడి ఉంది. కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రహస్యం. అది ఎక్కడ కూలిపోయిందనేది కానీ.. దానిని వెలికి తీయడానికి ఎంత కాలం పడుతుందని కానీ అమెరికా నౌకదళం నిర్ధారించడం లేదు.
చైనా ఇప్పటికే దక్షిణా చైనా సముద్రం అంతా తనదేనని వాదిస్తోంది. దానిని బలపరుచుకోవడానికి ఇటీవల ఎన్నో చర్యలు చేపట్టింది. 2016 అంతర్జాతీయ ట్రైబ్యూనల్ ఆదేశాన్ని పాటించడానికి నిరాకరిస్తోంది. దానికి చట్టబద్ధత ప్రాతిపదిక లేదని చెప్తోంది.
కూలిపోయిన ఎఫ్35సీ విమానం కోసం చైనా అన్వేషిస్తోందనే వాదనను చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ గురువారం ఖండించారు. ‘ఆ విమానం మీద మాకు ఆసక్తి లేదు’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు.
అయితే తమ అత్యాధునిక టెక్నాలజీ విమానాన్ని వెతికి పట్టుకెళ్లాలని చైనా సైన్యం చాలా ఆసక్తిగా ఉందని అమెరికా జాతీయ భద్రత నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సహాయ నౌక ఒకటి.. విమానం కూలిన ప్రదేశానికి కనీసం 10 రోజుల దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అలా జరిగితే చాలా ఆలస్యమవుతుందని డిఫెన్స్ కన్సల్టెంట్ ఆబి ఆస్డెన్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే అప్పటికీ బ్లాక్స్ బ్యాటరీ పనిచేయకుండా పోతుందని.. దాని వల్ల విమానం జాడను కనిపెట్టడం మరింత కష్టమవుతుందని అమెరికా అధికారులు తెలిపారు.
అమెరికా తన విమానాన్ని వెనక్కు తెచ్చుకోవడం చాలా ముఖ్యం. ఎఫ్35 యుద్ధ విమానం ఎగిరే కంప్యూటర్ వంటిది. ఇతర కీలక స్థావరాలు.. కంప్యూటర్లతో లింకయ్యేలా దానిని డిజైన్ చేశారు.
చైనా దగ్గర ఆ టెక్నాలజీ లేదు కాబట్టి.. ఆ విమానాన్ని పట్టుకోవడం ద్వారా వారు భారీ ముందడుగు వేయగలుగుతారని అమెరికా చెబుతోంది. అమెరికా నౌకదళం అమ్ముల పొదిలోకి చేరిన ఈ ఎఫ్35సీ విమానం.. శత్రువుల గగనతలంలో వారు గుర్తుపట్టకుండా ఎగరగలిగే తొలి ‘లో అబ్జర్వబుల్ విమానం కావడం విశేషం. పెద్ద రెక్కలు.. బలమైన ల్యాండింగ్ గేర్ వల్ల సముద్రంలో యుద్ధ నౌకల నుంచి ఈ విమానాన్ని లాంచ్ చేయడం సులభం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధవిమానం ఇంజిన్ ఇందులో ఉంది. గంటకు 1200 మైళ్ల వేగాన్ని.. అంటే మాక్1.6 వేగాన్ని చేరుకోగలదు.. రెక్కల మీద రెండు మిస్సైళ్లు, లోపల నాలుగు మిస్సైళ్లను మోసుకుపోగలదు. అందుకే చైనాకు చిక్కితే చాలా ప్రమాదం అని అమెరికా భావిస్తోంది.
చైనా చేసే సైబర్ గూడచర్యం వల్ల ఈ విమానం లోపలి సాంకేతిక గురించి చైనా వారికి కొంత తెలిసినప్పటికీ ఈ విమానాన్ని వాళ్లు చేజిక్కించుకోవాలని చైనా కోరుకుంటుందనడంలో సందేహం లేదని చైనా అధికారులు చెప్పారు.దీంతో అమెరికా ఎఫ్35సీ విమానం ప్రతిష్టాత్మకంగా మారింది.