Begin typing your search above and press return to search.

రష్యా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చేందుకు అమెరికా ప్లాన్లు?

By:  Tupaki Desk   |   9 March 2022 1:30 PM GMT
రష్యా ఆర్థికవ్యవస్థను కుప్పకూల్చేందుకు అమెరికా ప్లాన్లు?
X
ప్రపంచ చరిత్రలోనే అత్యంత కఠిన ఆంక్షలు రష్యా ఎదుర్కొంటోందా? అంటే ఔననే అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్. ఈ మేరకు ఉక్రెయిన్ పై దాడికి దిగిన రష్యాపై కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించడంలో ప్రపంచ దేశాలు తమతో కలిసి నడిచాయని తెలిపారు. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందన్నారు.

ఆంక్షలతో రష్యా ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయిందని.. ఆ దేశ కరెన్సీ రూబుల్ విలువ 50శాతానికి పైగా పతనమైందన్నారు. ఇప్పుడది ఒక పెన్నీ విలువ కూడా చేయదని జోబిడన్ అన్నారు. రష్యాలోని పెద్ద బ్యాంకులన్నింటిని అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నుంచి బహిష్కరించాం.. దీంతో ఇతర దేశాలతో వ్యాపారం చేసే సామర్థాన్ని రష్యా కోల్పోయింది' అని బైడెన్ శ్వేత సౌధంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా జోబైడెన్ రష్యా నుంచి గ్యాస్, ముడిచమురు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఐరోపా మిత్రదేశాలు ఈ విషయంలో తమతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేవన్నారు. వాటి పరిస్థితులను తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కు అండగా ఉంటూ నిధులు అందిస్తామని బైడెన్ స్పష్టం చేశారు.

ఆర్థిక, భద్రత, మానవతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు జోబైడెన్ తెలిపారు. చమురు దిగుమతులపై నిషేధం విధించడం ద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడించారు. రష్యాపై ఆంక్షలు విధించే విషయంలో ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి రావడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు 'అంటరానిది'గా మారిందని బైడెన్ పాలకవర్గంలోని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సగం వాటా కలిగిన దాదాపు 30 దేశాలు ఇప్పుడు మాస్కోపై ఆంక్షలు విధించాయన్నారు. తమ నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థయే గాక రానున్న రోజుల్లో రష్యన్ సైనిక వ్యవస్థ సైతం బలహీనంగా మారుతుందన్నారు.

ఆధునిక టెక్నాలజీ , సెమీ కండకండక్టర్ల వంటి ఉత్పత్తులు కూడా రష్యాకు అందుబాటులో లేకుండా చేస్తామని బైడెన్ తెలిపారు. ఫలితంగానే రష్యన్ మిలటరీ బలహీనంగా మారుతోందన్నారు. అమెరికా కంపెనీలన్నీ రష్యాలో మూసివేశారని.. రష్యా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చడమే ధ్యేయమని జోబిడెన్ సంచలన ప్రకటన చేశారు.