Begin typing your search above and press return to search.
అమెరికా చరిత్రలో తొలిసారి.. మంటగలిసిన వైట్‌హౌస్ పరువు!
By: Tupaki Desk | 23 Jan 2023 12:30 AM GMTవైట్‌హౌస్.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న అమెరికా అధ్యక్ష భవనం. అమెరికా విధానాల ను వ్యతిరేకించేవారు కూడా వైట్ హౌస్ అంటే.. ఒకింత మర్యాద ఇస్తారు. కొన్ని శతాబ్దాలుగా ఎంతో గౌరవం తెచ్చుకున్న ఈ వైట్ హౌస్ ఇప్పుడు పరువుపోయే పరిస్థితిలో అల్లాడిపోతోంది. దీనికి కారణం.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఆయన కుమారుడు కావడం గమనార్హం.
గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమస్యల్లో కూరుకుపోయారు. గతంలో 2009-16 మధ్య ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని రహస్య పత్రాలను ప్రభుత్వానికి అప్పగించకుండా దాచుకున్నారనే విషయం ఇటీవల వెలుగు చూసింది. ఈ క్రమంలో ఆయన తనకు ఏ పాపం తెలియదని అంటున్నా.. ప్రతిపక్షాల డిమాండ్‌కు న్యాయవ్యవస్థ దిగి వచ్చింది.
బైడెన్‌పై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఏకంగా.. బైడెన్ నివాసంలో 13 గంటలపాటు ఎఫ్బీఐ అధికారులు సోదాలు నిర్వహించి ఆరు రహస్య పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ ఘటన అమెరికా చరిత్రలోనే తొలిసారి జరిగిందని న్యాయనిపుణులు చెబుతున్నారు. బైడెన్ స్వగృహంలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) అధికారులు సోదాలు జరపడం.. అంటే ఒక అధ్యక్షుడి వ్యక్తిగత నివాసంలోఅయినా సరే.. ఇలా దాడులు చేయడం ఇదే చరిత్రలో తొలిసారి.
దీంతో ఇప్పటివరకు బైడెన్ వద్ద దాదాపు 12 రహస్య పత్రాలు బయటపడ్డాయి. ఈ రహస్య పత్రాలకు కేసును దర్యాప్తు చేయడానికి రాబర్ట్ హర్ అనే న్యాయవాదిని నియమించారు. న్యాయ శాఖ జరుపుతున్న దర్యాప్తునకు పూర్తిగా సహకరించమని బైడెన్ తమను ఆదేశించినట్లు బైడెన్ వ్యక్తిగత న్యాయవాది రిచర్డ్ సౌబర్ తెలిపారు. ఎఫ్బీఐ దాడుల సమయంలో అధ్యక్షుడు బైడెన్ గానీ, ఆయన భార్య కానీ స్వగృహంలో లేరని ఆయన వెల్లడించారు. ఈ పరిణామంతో ఇప్పుడు మరోసారి వైట్ హౌస్ వ్యవహారం ప్రపంచం ముందు.. చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు విపక్ష నేతలు.