Begin typing your search above and press return to search.
ఎలాన్ పుట్టుక పై షాకింగ్ కామెంట్స్ చేసిన అమెరికన్ ర్యాపర్..!
By: Tupaki Desk | 5 Dec 2022 6:30 AM GMTప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ పై అమెరికన్ ర్యాపర్ యే అలియాస్ కాన్యే వెస్ట్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అతడి వ్యాఖ్యలపై ఎలాన్ మాస్క్ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కాన్యే వెస్ట్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
కాన్యే వెస్ట్ అమెరికాలో ప్రముఖ ర్యాపర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఖాతాలో ఇప్పటికే 22 గ్రామీ అవార్డులు ఉండటం విశేషం. దీనికితోడు ప్రముఖ మోడల్ కిమ్ కర్ధాషియన్ పార్ట్ నర్(మాజీ) గానూ కాన్యే వెస్ట్ పాపులర్ అయ్యాడు. అయితే ఇటీవల తన ట్విట్టర్లో ఒబామా పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగింది.
ఈక్రమంలోనే "చర్చిలో నీచ పదాలు ఉపయోగించినందుకు నన్ను క్షమించండి.. కానీ ఒబామా అనే పదానికి ఇంకా నాకు మరో పదం లేదంటూ" ఇన్ స్టాలో పోస్టు చేశాడు. దీనికితోడు పలుమార్లు ట్విటర్లో హింసను ప్రేరేపించే కంటెంట్ ను కాన్యే వెస్ట్ గతంలోనూ పోస్ట్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతడి ఖాతాపై ట్విట్టర్ బ్యాన్ విధించింది.
ఇటీవలి కాలంలో అతడి ఖాతాను బ్యాన్ చేయడం ఇది రెండోసారి. అతడి ఖాతా బ్యాన్ పై ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ స్పందిస్తూ.. అతడి ఖాతాను బ్యాన్ చేయకుండా ఎంతో ప్రయత్నించానని అది జరుగక పోవడంపై విచారం వ్యక్తం చేశారు. క్యానే వెస్ట్ విషయంలో ఎలాన్ మాస్క్ సానుకూలంగా ఉన్నప్పటికీ అతడు మాత్రం తీవ్ర స్థాయిలో అతడిపై వ్యాఖ్యలు చేసి అందరికీ షాకిచ్చాడు.
ఎలాన్ పుట్టుకను ఉద్దేశిస్తూ.. మస్క్ లో ప్రవహిస్తున్న సగం రక్తం చైనీస్ అని నేను మాత్రమే అనుకుంటున్నానా?.. అతని చిన్నప్పటి ఫొటోలు ఎవరైనా చూశారా? అంటూ ఇన్ స్టాలో పోస్టు చేశారు. ఒక చైనీస్ మేధావిని తీసుకొచ్చి దక్షిణాఫ్రికా సూపర్ మోడల్ తో కలియిక జరపించడంతో ఎలాన్ పుట్టుకొచ్చాడంటూ అభ్యంతరమైన కామెంట్లు చేశాడు. క్యానే వ్యాఖ్యలపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.