Begin typing your search above and press return to search.
గుడ్ న్యూస్ : క్షణాల్లో కరోనా రిపోర్ట్ చెప్పే యాప్ సిద్ధం !
By: Tupaki Desk | 3 Nov 2020 1:30 AM GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతుంది. ఇప్పటివరకు దాదాపుగా 48 మిలియన్ల మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. అలాగే అనేక మంది కరోనా మహమ్మారితో మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే , కరోనా సోకిన వారిని గుర్తించడం కష్టంగా మారింది. లక్షణాలు కనిపించకుండానే కరోనా బారిన పడుతున్న వారు ఎంతో మంది ఉంటున్నారు. వారిలో ఏమాత్రం కరోనా లక్షణాలు కనిపించవు. టెస్టు చేయించుకుంటే మాత్రం కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. అలాంటి వారిని అసింప్టొమేటిక్ కరోనా పేషెంట్లు అంటున్నారు. ఇలాంటి వారి కోసం శాస్త్రవేత్తలు కొత్తగా ఒక యాప్ ను తయారు చేశారు.
స్మార్ట్ ఫోన్ లో ఉండే ఈ యాప్ ను వినియోగించి ఎవరైనా సరే తమలో అసింప్టొమేటిక్ లక్షణాలు ఉన్నాయా, లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యవంతుడికి, తనకు మధ్య ఉన్న తేడాను గమనించవచ్చు.అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రీసర్చర్లు ఈ యాప్ ను అభివృద్ధి చేశారు. ఒక వ్యక్తి దగ్గే తీరు, పలికే పదాలను బట్టి... సదరు వ్యక్తి అసింప్టొమేటిక్ పేషెంటా , కాదా అని యాప్ నిర్ధారిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ యాప్ పని చేయనుంది. తమను తాము పరీక్షించుకోవాలనుకునే వారు ఏం చేయాలంటే... తమ దగ్గును, మాటలను వెబ్ బ్రౌజర్లు, సెల్ ఫోన్, ల్యాప్ టాప్ డివైజెస్ ద్వారా సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత వీటిని యాప్ తన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. తన వద్ద ఉన్న వేలాది దగ్గులు, పదాల ఉచ్చారణలతో పోల్చి, ఆ వ్యక్తికి కరోనా సోకిందా అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. కరోనా పేషెంట్ల నుంచి రికార్డ్ చేసిన వేలాది దగ్గుల శబ్దాలను యాప్ లో ఫీడ్ చేశారు. కరోనా బారిన పడిన వారి 100 శాతం దగ్గులను ఇందులో చేర్చామని పరిశోధకులు తెలిపారు. ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ను ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ యాప్ కచ్చితంగా ప్రజలకు ఎంతో మేలు చేసే అవకాశం ఉంది.