Begin typing your search above and press return to search.

గ్రహ శకలంతో భూమికి రాబోతున్న అమెరికా అంతరిక్ష నౌక

By:  Tupaki Desk   |   11 May 2021 11:30 PM GMT
గ్రహ శకలంతో భూమికి రాబోతున్న అమెరికా అంతరిక్ష నౌక
X
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నాలుగు సంవత్సరల క్రితం ప్రయోగించిన ఒసిరిస్ రెక్స్ అనే అంతరిక్ష నౌక 2020 అక్టోబర్ 21న విజయవంతంగా బెన్నూ గ్రహశకలంపై ల్యాండ్‌ అయ్యింది. ఆ గ్రహ శకలం కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. గ్రహశకలంపై కంప్రెస్డ్‌ నైట్రోజన్ వాయివుతో కూడిన ఎక్స్‌ ప్లోజన్ తో బ్లాస్ట్‌ సృష్టించారు. దాంతో గ్రహ శకలంపై ఉన్న దుమ్ము దూలిని ఒసిరిస్ రెక్స్ సేకరించింది. కేవలం దుమ్ము దూలిని మాత్రమే కాకుండా గ్రహ శకలంపై ఉన్న కొన్ని రాళ్లు మరియు మట్టి తరహాలో ఉన్న ఉపరితల భాగంను రోబోటిక్ ఆర్మ్‌ తో ఒసిరిస్‌ రెక్స్‌ తీసుకుంది.

బెన్నూ గ్రహ శకలంపై ఉన్న దుమ్ము మరియు దూలితో పాటు రాళ్లు ఇతర మట్టి తరహా ఘనంను తీసుకుని ఒసిరిస్ రెక్స్ భూమి వైపు అడుగులు మొదలు పెట్టింది. బెన్నూ గ్రహ శకలంపై ల్యాండ్‌ అయ్యేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగానే పట్టింది. ఇప్పుడు తిరిగి రావడంకు మాత్రం దాదాపుగా రెండు సంవత్సరాల సమయం పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ అంతరిక్ష నౌక దాదాపుగా 33.4 కోట్ల కిలోమీటర్ల దూరంను ప్రయాణించినట్లుగా వారు పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అంచనా మేరకు ఈ అంతరిక్ష నౌక 2023 సెప్టెంబర్‌ 24న ఉటా ఎడారిలో ల్యాండ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం ఈ అంతరిక్ష నౌక గంటకు 600 మైళ్ల వేగంతో భూమి వైపుకు పరుగులు తీస్తున్నట్లుగా నాసా కేంద్రం వెళ్లడించింది. అంతరిక్ష నౌక తీసుకు వచ్చే గ్రహ శకలాలపై ప్రయోగాలకు శాస్త్రవేత్తలు సిద్దం అవుతున్నారు. 60 గ్రాముల ధూళి మరియు రాళ్లు మరియు మట్టి కణాలను అంతరిక్ష నౌక తీసుకు వస్తుందని వారు చెబుతున్నారు. గ్రహ శకలంపై సేకరించిన వాటితో ప్రయోగాలు చేసి సూర్య కుటుంబ రహస్యాలను ఛేదించే అవకాశం ఉందనే నమ్మకంను శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1999 లో ఈ గ్రహ శకలంను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అమెరికన్‌ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2175 నుండి 2199 సంవత్సరాల కాలంలో ఆ గ్రహ శకలం భూమిని ఢీ కొట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఆ గ్రహ శకలం వ్యాసంను 490 మీటర్లుగా గుర్తించారు.