Begin typing your search above and press return to search.

మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా స్ట్రెయిన్​..!

By:  Tupaki Desk   |   17 March 2021 7:30 AM GMT
మనదేశంలోకి ఎంట్రీ ఇచ్చిన అమెరికా స్ట్రెయిన్​..!
X
వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నా, చికిత్సలు జరుగుతున్నా.. కరోనా మాత్రం మనదేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయేటట్టు లేదు. ఇప్పటికే మనదేశంలో బ్రిటన్​కు చెందిన కొత్త స్ట్రెయిన్​ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన వేరియంట్​ కరోనా కేసులు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు వైద్యులు గుర్తించారు. జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్​నే కొత్త స్ట్రెయిన్​ కరోనాగా పిలుస్తారు. అయితే ఇప్పటికే బ్రిటన్​ స్ట్రెయిన్​ ఆందోళన కలిగించగా.. తాజాగా అమెరికా కు చెందిన L452R మ్యుటేషన్‌, E484Q మ్యుటేషన్​ కేసులు మన దేశంలో నమోదవుతున్నట్టు నేషనల్​ సెంటర్ ఫర్​ డిసీసీ కంట్రోల్​ పేర్కొన్నది.

ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో ఎక్కువగా కొత్త స్ట్రెయిన్​ కరోనా కేసులే ఎక్కువగా ఉన్నట్టు వైద్యులు అంటున్నారు. మహారాష్ట్రలో దాదాపు 20 శాతం కొత్త స్ట్రెయిన్​ కేసులే ఉన్నాయట. ప్రపంచంలో కొత్తగా కొన్ని వేల రకాల కరోనా స్ట్రెయిన్లు పుట్టుకొచ్చాయి. ఇండియాలో రెండు కరోనా కొత్త స్ట్రెయిన్లు బయటపడ్డాయి. మహారాష్ట్రలో సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ శాస్త్రవేత్తలు.. మొత్తం 7 వేల శాంపిళ్లను గుర్తించారు. వాటిలో E484Q, L452R మ్యటేషన్లు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులు కేవలం మహారాష్ట్రకే పరిమితమయ్యాయా? లేక ఇతర రాష్ట్రాలకు పాకాయా? అన్న విషయంపై వైద్యులు పరిశోధిస్తున్నారు.

కొత్త స్ట్రెయిన్లు ఎంతో ప్రమాదకరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కాబట్టి ఈ కొత్త స్ట్రెయిన్ల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటడాలని సూచిస్తున్నారు. మిగతా స్ట్రెయిన్లతో పోల్చుకుంటే అమెరికా స్ట్రెయిన్​ 50 శాతం ఎక్కువ వేగంతో వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయ పడుతున్నారు. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ వ్యాక్సిన్​ వేయించుకున్నప్పటికీ కచ్చితంగా మాస్కులు ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. లేదంటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు కొత్త స్ట్రెయిన్​ కేసు ఢిల్లీలో కూడా నమోదైంది. 38 ఏళ్ల ఓ వ్యక్తికి కొత్త స్ట్రెయిన్​ కరోనా సోకినట్టు వైద్యులు గుర్తించారు. అతడిని ప్రస్తుతం ప్రత్యేక క్వారంటైన్​ లో ఉంచారు. కొత్త స్ట్రెయిన్​ కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నందున ప్రజలంతా కచ్చితంగా టెస్టులు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.