Begin typing your search above and press return to search.
అమెరికా కీచక గురువుకు 120 ఏళ్ళ జైలుశిక్ష !
By: Tupaki Desk | 28 Oct 2020 2:30 PM GMTఅమెరికాలో మహిళలను తన బానిసలుగా మార్చుకుంటూ వారితో సెక్స్ కల్ట్ నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 60 ఏళ్ళ సెల్ఫ్ హెల్ప్ గురు ..కీత్ రానీరేకి న్యూయార్క్ కోర్టు 120 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. లైఫ్ కోచింగ్ సంస్థ నెక్సిమ్ నేతగా సంపన్నులు, ప్రముఖుల కోటరీని ఆకర్షించిన కీత్ రెనీర్ కు మహిళలను తనతో బలవంతంగా లైంగిక సంబంధాలు పెట్టుకునేలా ఒత్తిడి చేసినట్టు రుజువు కావడంతో జడ్డి జీవిత ఖైదు విధించారు. ఐదు రోజుల సెల్ప్ హెల్ప్ కోర్సుల కోసం ఒక్కొక్కరి వద్ద 5000 డాలర్లను ఈ సంస్థ వసూలు చేస్తుంది. కొంతమంది స్త్రీలను ఆర్థికంగా, లైంగికంగా వాడుకోవడమే గాక, వారి చేత తప్పనిసరిగా ‘డైట్’ పాటించాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిసింది. అందుకు ఇతడిని ‘భక్తులు’ ‘వాన్ గార్డ్’ గా వ్యవహరించేవారట.
వారి వ్యక్తిగత సమాచారం, అభ్యంతరకర ఫోటోలను భద్రపరిచేవాడు. రవీన్ పై మహిళల అక్రమ రవాణా, దోపిడీ, నేరపూరిత కుట్ర, బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలు రుజువుకావడంతో 2019 జూన్‌లో కోర్టు దోషిగా నిర్ధారించింది. బాధితులు 15 మందిలో 13 మంది మహిళలు బ్రూక్లిన్ కోర్టుకు హాజరుకాగా, మరో 90 మందికి పైగా బాధితులు జడ్జి నికోలస్ గరాఫికి లేఖలు రాశారు. గ్రూప్ లో ‘డీఓఎస్’ అనే ఫ్యాక్షన్ ని కూడా ఏర్పాటు చేశాడని, ఇది పిరమిడ్ స్ట్రక్చర్ లా ఉంటుందని,ఇందులో బానిసలుగా మహిళలు ఉంటే టాప్ లో కీత్ ‘గ్రాండ్ మాస్టర్’ మాదిరి కూర్చునేవాడని తెలిసింది.
1998లో న్యూయార్క్ రాష్ట్రంలో నెక్సిమ్ పేరుతో రనీర్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2018లో మెక్సికోలో అరెస్టయిన రనీరే 20 సంవత్సరాల లోపు మహిళలతో వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం ఏర్పాటు చేసిన సబ్ గ్రూప్‌ను తన లైంగిక వాంఛలు తీర్చుకునేందుకు ఉపయోగించుకున్నారు. వీరిలో 15 సంవత్సరాల బాలిక సైతం ఉన్నారు. తన బాధితులు అనుభవించిన క్షోభ, ఆగ్రహం పట్ల రనీర్ విచారం వ్యక్తం చేస్తూనే తనపై వచ్చిన అభియోగాలు వాస్తవం కాదని కోర్టుకు నివేదించారు. అయితే ఆ వాదనలు కోర్టు తోచి పుచ్ఛి కీచక గురువు కి జీవిత ఖైదు విధించింది.