Begin typing your search above and press return to search.
ఏపీ వ్యవసాయానిక అమెరికా సాయం
By: Tupaki Desk | 10 Aug 2015 11:18 AM GMTనవ్యాంధ్రలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి రెండంకెల వృద్ధి సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. జపాన్ సాయంతో వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకుంది. తాజాగా, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పెంచడం, భూమి విస్తీర్ణాన్ని జీపీఎస్ ద్వారా కచ్చితంగా నిర్థరించడం, సేంద్రియ ఎరువులతో కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి అమెరికా ముందుకు వచ్చింది. తన ప్రతినిధి బృందాన్ని నవ్యాంధ్రకు పంపింది.
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని లాం ఫారంలో పర్యటించిన ప్రతినిధి బృందం.. అక్కడి అధికారులతో సమావేశమైంది. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు వాటి నాణ్యతను పెంచితే రైతులకు మరింత ధర వస్తుందని ఆ బృందం వివరించింది. అమెరికాలో వ్యవసాయ రంగంలో సాంకేతికత బాగా అభివృద్ధి చెందిందని, ఇప్పుడు దానిని నవ్యాంధ్రకు అందించడానికి తాము సుముఖంగా ఉన్నామని హామీ ఇచ్చింది. లాం కేంద్రంగానే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోవాలని కూడా భావిస్తోంది.