Begin typing your search above and press return to search.
విస్కీ బాటిల్ కోసం అమెరికా వేట
By: Tupaki Desk | 6 Aug 2021 4:23 PM GMTవిస్కీ బాటిల్.. అదెంతో పురాతనమైనది.. దానికోసం ఇప్పుడు అమెరికా ప్రభుత్వం వేట మొదలుపెట్టింది. ఈ విస్కీ బాటిల్ కనిపించడం లేదని శోధిస్తోంది. ఈ విస్కీ ఖరీదు ఎంతో తెలుసా? 5800 డాలర్లు. మన కరెన్సీలో అక్షరాల 4.30 లక్షల రూపాయలు. దీన్ని 2019లో అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోకు జపాన్ ప్రభుత్వం బహూకరించిందని ట్రెజరీ విభాగం తెలిపింది.
అయితే ఈ ఖరీదైన విలువైన బాటిల్ అధికారిక లెక్కల్లో కనిపించడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సంబంధిత అధికారులు మాయమైన ఈ విస్కీ బాటిల్ కోసం విచారణ చేపట్టారు.
విదేశాంగ కార్యదర్శిగా గత డొనాల్డ్ ట్రంప్ హయాంలో పాంపియో పనిచేస్తున్నప్పుడు జూన్ 24, 2019న సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో జపాన్ అధికారులు అమెరికా విదేశాంగ శాఖకు దీన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే అది పాంపియో స్వీకరించాడా? లేదా అనేది అస్పష్టంగా ఉందని టైమ్స్ నివేదిక పేర్కొంది.
తాజాగా ఈ వివాదంపై పాంపియో న్యాయవాది స్పందించాడు. మిస్టర్ పాంపియోకు అప్పట్లో ఈ విస్కీ బాటిల్ అందుకున్న జ్ఞాపకం లేదని.. అలానే ఆ బాటిల్ ఎలా మాయమైందనేది కూడా తనకు తెలియదని వెల్లడించారు.
ఇక అత్యంత రక్షణ, భద్రత, నిఘా ఉండే ప్రభుత్వ ఆధీనంలో ఉండే వస్తువు మాయం కావడంతో ఇప్పుడు అమెరికా ప్రభుత్వ వర్గాల్లో వైరల్ గా మారింది.