Begin typing your search above and press return to search.
అమెరికా మహిళల క్రికెట్ జట్టు.. అందరూ భారతీయులే.. తెలుగోళ్లు కూడా
By: Tupaki Desk | 3 Oct 2022 12:30 PM GMTఓ దేశ జాతీయ జట్టులో ఒకరో ఇద్దరో ఇతర దేశాల్లో పుట్టినవారు ఉండొచ్చు. దక్షిణాఫ్రికాలో పుట్టిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ కు ఆడాడు. న్యూజిలాండ్ లో జన్మించిన బెన్ స్టోక్స్ష్ ఇంగ్లండ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన సికిందర్ రజా జింబాబ్వేకు ఆడుతున్నాడు.. ఇవన్నీ క్రికెట్ లో సహజం. అయితే, ఒకరో ఇద్దరో మహా అంటే ముగ్గురు ఇతర దేశాల్లో పుట్టి మరొక దేశానికి ఆడుతుంటారు. కానీ, ఒక దేశ జాతీయ జట్టు మొత్తం ప్రవాస సంతతికి చెందినవారితో ఉంటే..? ఆ ప్రవాసులందరూ మన భారతీయులే అయితే..? అంతకంటే ఆశ్చర్యం కాదుకాదు.. విశేషం ఏముంటుంది? అమెరికా జాతీయ మహిళల క్రికెట్ జట్టు విషయంలో ఇదే జరిగింది.
వింత కాదు విశేషం చైనా వారి తర్వాత అమెరికాలో భారతీయుల సంఖ్య సహజంగానే అధికం. అందులోనూ మనవాళ్లు ఎక్కడుంటే అక్కడ క్రికెట్ కల్చర్ పెరిగిపోతుండడం సహజం. ఇలానే అమెరికా పురుషుల క్రికెట్ జట్టులో భారతీయులదే మెజార్టీ సంఖ్య.
ఇప్పుడు అమ్మాయిల వంతు. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే.. పురుషుల జట్టులో ముగ్గురు నలుగురైనా పాకిస్థాన్, వెస్టిండీస్ ఇతర దేశాలకు చెందినవారున్నారు. కానీ, అమెరికా అమ్మాయిల జట్టులో మొత్తం ప్రవాస భారతీయ మహిళలు/అమ్మాయిలే ఉండడం విచిత్రం. గత నెలాఖరులో పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్ లో మైదానంలోకి దిగిన అమెరికా మహిళల క్రికెట్ జట్టును చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ జట్టులో 11 మంది ప్రవాస భారతీయ మహిళలే కావడం విశేషం.
ఎందుకిలా..? అమెరికాలో బేస్ బాల్, బాస్కెట్ బాల్ కు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. టెన్నిస్ ది వీటి తర్వాత స్థానం. దీంతో క్రికెట్ కు పెద్దగా ప్రాధాన్యం దక్కదు. అయితే, ఇప్పుడిప్పుడే అక్కడ క్రికెట్ ప్రాణం పోసుకుంటోంది. పురుషుల జట్టు ఇటీవల టి20 ప్రపంచ కప్ అర్హతను త్రుటిలో చేజార్చుకుంది. అయితే, పురుషుల విభాగంలో చాలా ఎక్కువ దేశాలు క్రికెట్ ఆడుతున్నాయి. అదే మహిళల్లో అయితే ఈ సంఖ్య చాలా స్వల్పమే అని చెప్పాలి. అయితే, భారత్ కు మాత్రం మంచి జట్టే ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో పుట్టిన లేదా అమెరికా వెళ్లిన భారతీయ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు/ మహిళలు క్రికెట్ ఆడుతూ జాతీయ స్థాయికి ఎదిగారు.
టీనేజర్లు.. మనమ్మాయే చిన్నది అమెరికా జాతీయ జట్టుకు ఆడుతున్న భారతీయ సంతతి అమ్మాయిల్లో టీనేజర్లే అధికం. కర్ణాటకకు చెందిన సింధు శ్రీ హర్ష వీరి కెప్టెన్. ఈమె వయసు 34 ఏళ్లు. అయితే, దిశా ధింగ్రా, స్నిగ్ధా పాల్, రితూ సింగ్, సుహానీ రాజీవ్ థడానీ వయసు 16 ఏళ్లే.
అనికా కోలన్, ఇషానీ వాఘేలా, లిసా రంజిత్ ల వయసు 20 లోపే. కాగా, ఈ జట్టులో తెలుగమ్మాయిలూ ఉన్నారు. పేర్లను బట్టి చూస్తే 17 ఏళ్ల భూమిక భద్రిరాజు, సాయి తన్మయ్ ఎయ్యోనిలు తెలుగువారని తెలుస్తోంది. వీరిందరిలోనూ సాయి తన్మయ్ వయసు 15 ఏళ్లే. చిత్రమేమంటే.. వైశాల్యంలో అతి చిన్న దేశమైన, వసతుల్లో అమెరికాతో అసలు పోటీనే లేని పపువా న్యూ గినియాతో జరిగిన ఈ టి20 మ్యాచ్ లో అమెరికా జట్టు 76 పరుగులు మాత్రమే చేయగలిగింది. పపువా జట్టు ఈ లక్షాన్ని 11 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.